IND vs RSA : దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు(Team India) నయా చరిత్ర సృష్టించింది. అందని ద్రాక్షలా ఊరిస్తున్న టెస్టు సిరీస్‌ను ఒడిసి పట్టకున్నా అద్భుత విజయంతో సిరీస్‌ను సమం చేసింది.. సిరీస్ డిసైడర్‌లో సఫారీ జట్టు నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ 3 వికెట్ల నష్టానికే ఛేదించింది. తద్వార కేప్‌టౌన్(Cape Town)లో తొలి టెస్టు విజయం నమోదు చేసిన ఆసియా జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఎయిడెన్ మర్క్రమ్(106) వీరోచిత శతకంతో జట్టుకు స్వల్ప ఆధిక్యాన్ని అందించినా.. యశస్వీ జైస్వాల్(28), రోహిత్ శర్మ(17 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలి రోజే 23 వికెట్లు పడిన కేప్‌టౌన్ పిచ్‌పై రెండో రోజే ఫలితం తేలిపోయింది. ఊహించినట్టుగానే టీమిండియా చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. సెషన్ సెషన్‌కు ఆధిపత్యం మారుతూ వచ్చిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ల విజృంభణతో సఫారీ జట్టు చేతులెత్తేసింది. బుమ్రా ఆరు వికెట్లతో సఫారీల నడ్డి విరవడంతో రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 176 రన్స్‌కే పరిమితమైంది.
స్వల్ప ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ(17), యశస్వీ జైస్వాల్(28) టీ20 తరహాలో రెచ్చిపోయారు. యశస్వీ ఔటయ్యాక శుభ్‌మన్ గిల్(10)ను రబడ వెనక్కి పంపాడు. జాన్సెన్ ఓవర్లో విరాట్ కోహ్లీ(12) ఔటయ్యాక.. శ్రేయస్ అయ్యర్(4) బౌండరీతో జట్టును గెలిపించాడు.
A Cape Town epic from Aiden Markram 🙇♂️
That pitch, that attack, this innings 💯https://t.co/pLPYk8gO2A | #SAvIND pic.twitter.com/qCXwcvFSlH
— ESPNcricinfo (@ESPNcricinfo) January 4, 2024
రెండో రోజు 62/3 తో ఇన్నింగ్స్ ఆరంభించిన సఫారీ జట్టు 176 పరుగులు చేయగలిగిందంటే అదంతా మర్క్రమ్ చలవే. బౌలర్లకు స్వర్గధామమైన కేప్‌టౌన్ పిచ్‌పై మర్కర్రమ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా దంచికొడుతూ భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. 99 బంతుల్లోనే సెంచరీ సాధించిన మర్క్రమ్.. 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 రన్స్ కొట్టాడు. సిరాజ్ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి రోహిత్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత కాసేపటికే ప్రొటిస్ ఇన్నింగ్స్ ముగిసింది. బుమ్రా ఆరు వికెట్లతో సత్తా చాటాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఎల్గర్ సేనకు ఆదిలోనే సిరాజ్ చుక్కలు చూపించాడు. బుల్లెట్ లాంటి బంతులతో టాపార్డర్‌ను వణికించాడు. మర్క్రమ్(0), ఎల్గర్(4), జొర్జి(2)లను ఔట్ చేసిన సిరాజ్.. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు కూల్చాడు. బుమ్రా, ముకేశ్ తలా రెండు వికెట్లు తీయడంతో సఫారీ జట్టు 55 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు రబడ షాకిచ్చాడు. యశస్వీ జైస్వాల్()ను బౌల్డ్ చేశాడు. రోహిత్ శర్మ(39), శుభ్‌మన్ గిల్(0) ధాటిగా ఆడి.న ఔటయ్యాక కోహ్లీ(46) మరోసారి ఒంటరి పోరాటం చేశాడు. కానీ, 11 బంతుల వ్యవధిలోనే ఇండియా ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులకే ఆలౌటయ్యింది. దారుణం ఏంటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు ప్లేయర్లు డకౌట్‌గా వెనుదిరిగారు.