లీడ్స్ : మహిళల టీ20 ప్రపంచకప్ తొలి పోరులో దాయాది పాకిస్థాన్ భరతం పట్టిన భారత్ మలి మ్యాచ్‌లో చిన్న జట్టు నెదర్లాండ్స్‌ను ్తచిత్తుగా ఓడించింది. బుధవారం ఏకపక్షంగా సాగిన లీగ్ పోరులో95 పరుగుల తేడాతో డచ్‌పై భారీ విజయం సాధించింది. ఓపెనర్లు స్మృతి మంధాన(47 బంతుల్లో 74), షెఫాలీ వర్మ (55) అర్ధసెంచరీలతో తొలుత భారత్ 20 ఓవర్లలో 209/5 స్కోరు చేసింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
మంధాన, షెఫాలీ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించగా, రీచాఘోష్(8 బంతుల్లో 20 నాటౌట్) ధనాధన్ ఆటతీరుతో భారత్ 200 మార్క్ అందుకుంది. లక్ష్యఛేదనలో తెలుగు స్పిన్నర్ శ్రీచరణి(4/19) ధాటికి డచ్ టీమ్ 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. చరణికి తోడు షెఫాలీ(3/20), నందినిశర్మ(2/22) దెబ్బకు నెదర్లాండ్స్ కెప్టెన్ డీ లీడె(28), హీథర్ సీజర్స్(21) మినహా అందరూ స్వల్ప స్కోర్లకు పెవిలియన్ చేరారు. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
1 పరుగుల(95) పరంగా టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ విజయం. 2024లో శ్రీలంకపై 82 రన్స్‌తో గెలిచిన రికార్డు బ్రేక్ అయింది.