రాజ్‌గిర్ (బీహార్): డిఫెండింగ్ చాంపియన్ భారత్ మహిళల ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ) హాకీ టోర్నీలో విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ టోర్నీలో సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న భారత అమ్మాయిలు..
ఆదివారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 3-0తో జపాన్ను చిత్తుచేసి పాయిం పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. భారత్ నుంచి దీపిక (47, 48వ నిమిషాల్లో) వరుస గోల్స్ చేయగా నవ్‌నీత్ కౌర్ (37వ ని.) ఓ గోల్ సాధించింది. సెమీస్‌లో భారత్.. మంగళవారం జపాన్‌తో ఆడుతుంది.