లెక్క సరి

- ఇంగ్లండ్‌పై 317 పరుగులతో భారత్ గెలుపు
పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న రీతిలో టీమ్ఇండియా విజృంభించింది. తొలి టెస్టులో ఘోర పరాజయం మూటగట్టుకున్న చెపాక్ పిచ్‌పైనే అంతకుమించిన భారీ విజయం సాధించింది. స్పిన్ వికెట్‌పై అరంగేట్ర ఆటగాడు అక్షర్ పటేల్, లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ విజృంభించడంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఈ దెబ్బతో సిరీస్ సమం చేయడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో రెండో స్థానానికి చేరిన కోహ్లీసేన.. అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న మూడో టెస్టు (డే అండ్ నైట్) కోసం రెడీ అవుతున్నది.
చెన్నై: తొలి టెస్టు పరాజయాన్ని పక్కనపెట్టి దుమ్మురేపిన టీమ్ఇండియా రెండో టెస్టులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాలుగు రోజుల్లో ముగిసిన పోరులో భారత్ 317 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. పరుగుల పరంగా ఇంగ్లిష్ జట్టుపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఏడాది విరామం అనంతరం ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు మైదానానికి వచ్చిన అభిమానులకు టీమ్ఇండియా చక్కటి బహుమతినిచ్చింది. కఠినమైన పిచ్‌పై బ్యాట్స్‌మన్ పోరాటానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో కోహ్లీసేన సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.
ఇక ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంటో నెగ్గి మరో టెస్టును ‘డ్రా’చేసుకున్నా భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. 482 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ మంగళవారం రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్. లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో సత్తాచాటగా.. అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ భారీ సెంచరీతో భారత్ 329 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 134 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ వీరోచిత శతకం బాదడంతో ఇంగ్లండ్ ముందు కొండంత లక్ష్యం నిలిచిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌కు కష్టసాధ్యంగా ఉందనే వాదనలు వచ్చిన చెపాక్ పిచ్‌పై భారత ఆటగాళ్లు రెండు సెంచరీలు.. మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేస్తే.. ఇంగ్లండ్ ప్లేయర్లలో ఒక్కరూ అర్ధశతకం సాధించలేకపోయారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన అశ్విన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 24న అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్టు (డే అండ్ నైట్) ప్రారంభం కానుంది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 329, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 134, భారత్ రెండో ఇన్నింగ్స్: 286, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) కోహ్లీ (బి) అశ్విన్ 25, సిబ్లే (ఎల్బీ) అక్షర్ 3, లారెన్స్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 26, లీచ్ (సి) రోహిత్ (బి) అక్షర్ 0, రూట్ (సి) రహానే (బి) అక్షర్ 33, స్టోక్స్ (సి) కోహ్లీ (బి) అశ్విన్ 8, పోప్ (సి) ఇషాంత్ (బి) అక్షర్, ఫోక్స్ (సి) అక్షర్ (బి) కుల్దీప్ 2, అలీ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 43, స్టోన్ (ఎల్బీ) అక్షర్ 0, బ్రాడ్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 164. వికెట్ల పతనం: 1-17, 2-49, 3-50, 4-66, 5-90, 6-110, 7-116, 8-116, 9-126, 10-164, బౌలింగ్: ఇషాంత్ 6-3-13-0, అక్షర్ 21-5-60-5, అశ్విన్ 18-5-53-3, సిరాజ్ 3-1-6-0, కుల్దీప్ 6.2-1-25-2.
తాజావార్తలు
- 37 రోజుల పసిబిడ్డకు కరోనా పాజిటివ్
- హృతిక్‌తో ప్రభాస్ మల్టీ స్టారర్ చిత్రం..!
- ‘మైత్రి సేతు’ను ప్రారంభించనున్న ప్రధాని
- కిడ్నీలో రాళ్లు మాయం చేస్తానని.. బంగారంతో పరార్
- ఏడుపాయల హుండీ ఆదాయం రూ.17లక్షల76వేలు
- సూపర్బ్.. భారతదేశ పటం ఆకారంలో విద్యార్థినులు
- బిగ్ బాస్ హారికకు అరుదైన గౌరవం
- కామాంధుడికి జీవిత ఖైదు
- అరసవల్లి సూర్యనారాయణస్వామిని తాకని భానుడి కిరణాలు
- అలియా భట్ ‘గంగూభాయ్’ సినిమాపై చెలరేగిన వివాదం