జోహర్ బహ్రు(మలేషియా): సుల్తాన్ జోహర్ కప్‌లో భారత యువ హాకీ జట్టు కాంస్య పతకం సొంతం చేసుకుంది. శనివారం జరిగిన వర్గీకరణ పోరులో భారత్ 3-2 (పెనాల్టీ షూటౌట్)తో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
మ్యాచ్ నిర్ణీత సమయంలో ఇరు జట్ల గోల్స్ 2-2తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ తప్పనిసరైంది. షూటౌట్లో గుర్జ్యోత్సింగ్, మన్మీత్సింగ్, సౌరభ్ ఆనంద్ గోల్స్ చేశారు. గోల్‌కీపర్ బిక్రమ్జీత్సింగ్..ప్రత్యర్థి స్ట్రైకర్ల గోల్స్‌కు అడ్డుగోడగా నిలిచాడు.