WCL : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చినప్పటి నుంచీ భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాది దేశంతో క్రికెట్ వద్దే వద్దని అభిమానులు బీసీసీఐ(BCCI)ని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాళ్లు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్‌తో ఆడేది లేదని తేల్చి చెబుతున్నారు. వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్ (WCL) టోర్నీలో ఇప్పటికే పాక్‌తో లీగ్ మ్యాచ్ ఆడని ఇండియా ఛాంపియన్స్ జట్టు ఆటగాళ్లు అదే మాటకు కట్టుబడి ఉన్నారు.
పాక్‌తో సెమీ ఫైనల్ అయినా సరే ఆడమని తెగేసి చెప్పిన శిఖర్ ధావన్(Shikhar Dhawan), హర్భజన్ సింగ్, యువరాజ్లు.. మ్యాచ్‌నూ బాయ్‌కాట్ చేయాలని భావిస్తున్నారు. దాంతో, డబ్ల్యూసీఎల్ నుంచి ఇండియా ఛాంపియన్స్ నిష్క్రమించనుంది. జూలై 31న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సెమీస్ జరగాల్సి ఉంది. అయితే.. భారత మాజీలు మాత్రం పాక్‌తో తలపడేందుకు అయిష్టం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది.
Dear @BCCI, it’s time to put the nation first, not money. Please opt out of the match against Pakistan.
Indian players have decided not to play against Pakistan in the WCL semifinal on Thursday. Respect 🫡 #WCL25 #IndVsPak #BCCI pic.twitter.com/qACmRjgy1H
— Shubhankar Mishra (@shubhankrmishra) July 30, 2025
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలతో భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడేందుకు ఇరుబోర్డులు అంగీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు మాత్రం దాయాది జట్టుతో మ్యా్చ్ ఆడేందుకు ససేమిరా అంటున్నారు. వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ ఆఫ్ లెజెండ్స్‌లో భాగంగా జూలై 20 ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారు. ఇకపై కూడా అదే రిపీట్ అవుతుందని అన్నాడు ధావన్.
చిరకాల ప్రత్యర్థులు సెమీస్ చేరితే అప్పుడు ఏం చేస్తారు? అని మీడియా ప్రశ్నించగా.. గబ్బర్ మాత్రం తన నిర్ణయం మార్చుకోనని స్పష్టం చేశాడు. అతడు చెప్పినట్టే భజ్జీ, యూవీలు సైతం పాక్‌తో ఆడమని భీష్మించుకొని ఉన్నారు. దాంతో, ఐసీసీ సెమీస్‌ను రద్దు చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో.. గత సీజన్ విజేత అయిన ఇండియా ఛాంపియన్స్ ఈసారి ఉత్త చేతులతోనే ఇంటిబాట పట్టనుంది.