తుర్కయంజాల్,జూలై 30 : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఇంజాపూర్ మాజీ ఉప సర్పంచ్ ధన్రాజ్ గౌడ్ కాలనీ వాసులకు సూచించారు. బుధవారం తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి ఇంజాపూర్ మిధాని కాలనీలో వనోమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటి అధికారులు కాలనీ వాసులకు ఇంటింటికి తిరిగి మొక్కలను అందజేశారు.
ఈ సందర్భముగా ధన్రాజ్ గౌడ్ కాలనీ వాసులతో కలసి మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతూ మొక్కలను నాటాడంతో పాటుగా వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో మిధాని కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.