రేవంత్ రెడ్డి వద్దు.. కేసీఆరే మళ్లీ రావాలంటూ అల్లీపూర్లో ఓ అవ్వ ముచ్చట..
రేవంత్ రెడ్డి పాలన ఏమి మంచిగా లేదు . కేసీఆర్ పాలననే మంచిగా ఉండే... మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మంచిగా ఉంటుందని ఓ 65 ఏండ్ల వృద్ధురాలు గత కేసీఆర్ పాలన, ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనపై తన మనసులోనీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.
రాయికల్, జులై, 30 : రేవంత్ రెడ్డి పాలన ఏమి మంచిగా లేదు . కేసీఆర్ పాలననే మంచిగా ఉండే… మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మంచిగా ఉంటుందని ఓ 65 ఏండ్ల వృద్ధురాలు గత కేసీఆర్ పాలన, ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనపై తన మనసులోనీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. వివరాల్లోకి వెళితే రాయికల్ మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన పంతెంగి లక్ష్మీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారం తో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైంది.
కాగా మంజూరైన చెక్కును జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ బుధవారం ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా వసంత లబ్ధిదారురాలు లక్ష్మి ఇంటికి వెళ్లగా ఆమె లేకపోవడంతో ఆమె అత్త మల్లవ్వకు అందజేశారు. ఈ సందర్భంగా మల్లవ్వ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరూ సంతోషంగా లేరని, మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇంకోసారి కాంగ్రెస్ కి ఓటు వేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, నాయకులు హన్మండ్ల మహేష్, మోర వెంకటేశ్వర్లు, సాగర్ రావు, రాజి రెడ్డి, సాయి రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

