చండీగఢ్ : టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఒలింపిక్స్‌లో నీరజ్ అద్భుత ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించిన హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ ఆనందంతో డ్యాన్స్ చేశారు.
#WATCH | Haryana Home Minister Anil Vij breaks into dance as javelin thrower Neeraj Chopra, a native of Panipat, wins the first #Gold medal for India at #Tokyo2020 pic.twitter.com/bW2v0B9Gbj
— ANI (@ANI) August 7, 2021
కాగా, ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో వందేండ్ల తర్వాత భారత్‌కు తొలి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాపై ప్రసంశలు వెల్లివెరిశాయి. హర్యానాలోని పానిపట్‌కు చెందిన ఆయనకు ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ రూ.6 కోట్ల భారీ నగదు ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించారు.
#WATCH live from javelin thrower Neeraj Chopra's residence in Panipat, Haryana
— ANI (@ANI) August 7, 2021
Chopra wins gold at #TokyoOlympics https://t.co/0kj0q2Pruu
మరోవైపు నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడంపై ఆయన సోంతూరులో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లోని సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా సంబరాలు జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలను ఊపుతూ, డప్పులు వాయిస్తూ దేశభక్తి గీతాలు ఆలపించారు.
Jammu and Kashmir: CRPF personnel celebrate in Jammu after Neeraj Chopra bagged first #TokyoOlympics2020 gold medal for India in Javelin throw pic.twitter.com/cBmPEdQrY8
— ANI (@ANI) August 7, 2021