Kohli – Rohit : వచ్చే వన్డే వరల్డ్ కప్ సన్నద్ధతలో ఉన్న భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Roht Sharma)కు మద్దతు పెరుగుతోంది. అనుభవజ్ఞులైన రోకో మెగా టోర్నీలో ఆడడం టీమిండియాకు కలిసొస్తుందని మాజీలు అంటుండగా.. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ (Morne Morkel) సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లైన ఈ ఇద్దరిని 2027 ఎడిషన్‌లో కచ్చితంగా ఆడించాలని మోర్కెల్ చెబుతున్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో సత్తా చాటాలనుకుంటున్న కోహ్లీ, రోహిత్ గురించి అతడు మరో ఆసక్తికర విషయం పంచుకున్నాడు.
సొంతగడ్డపై కనీస పోరాటం కొరవడి టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది టీమిండియా. సఫారీల జోరుతో 25 ఏళ్లకు ఆ జట్టుకు సిరీస్ సమర్పించుకున్న భారత్ వన్డే సిరీస్ పట్టేయాలనే కసితో ఉంది. నవంబర్ 30న రాంచీలో తొలి మ్యాచ్ సన్నాహకాల్లో ఉంది టీమిండియా. లండన్ నుంచి వచ్చేసిన కోహ్లీ, ముంబై నుంచి రాంచీ చేరుకున్న రోహిత్ నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలెట్టేశారు. ఈ సందర్భంగా విరాట్, రోహిత్‌తో ఆడిన అనుభవాలను గుర్తు చేసుకున్న మోర్నీ మోర్కెల్ వీరి భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ, రోహిత్‌తో కలిసి నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. వీరిద్దరికి బౌలింగ్ సవాల్‌గా అనిపించేది. రోకో కారణంగా ఎన్నో నిద్రలేని రాత్రులు చవిచూశాను. కోహ్లీ, హిట్‌మ్యాన్ నాణ్యమైన క్రికెటర్లు. వీరిని కచ్చితంగా వచ్చే వన్డే ప్రపంచ కప్ ఆడించాలి.
Morne Morkel talks about Rohit Sharma and Virat Kohli in relation to the 2027 ODI World Cup. 🌟🇮🇳#Cricket #ODI #INDvSA pic.twitter.com/FRy0tFBb98
— Sportskeeda (@Sportskeeda) November 28, 2025
ఫిట్‌గా ఉండి.. పరుగులు సాధిస్తే వీరిని మెగా టోర్నీకి ఎంపిక చేయవచ్చు. ఎందుకంటే.. ఐసీసీ టోర్నీల్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడం చాలాముఖ్యం. వరల్డ్ కప్ వరకూ ‘రో-కో’ ఫిట్‌గా ఉంటే స్క్వాడ్‌లో ఉండే అవకాశముంది అని మోర్కెల్ తెలిపాడు. వన్డే సిరీస్‌లో విజయావకాశాలపై స్పందించిన మోర్కెల్ .. ఈ రెండు వారాలు మమ్మల్ని చాలా నిరాశకు గురి చేశాయి. అయితే.. వన్డేల్లో సత్తా చాటుతాం. వన్డే ఫార్మాట్లో మా శక్తినంతా ఉపయోగిస్తాం. ఇటీవల కాలంలో భారత్ వన్డేల్లో బాగా ఆడుతోంది. సీనియర్లు కోహ్లీ, రోహిత్ స్క్వాడ్‌లో ఉండడం కొత్త ఎనర్జీనిస్తోంది’ అని చెప్పాడీ సఫారీ మాజీ పేసర్. ఒకప్పుడు దక్షిణాఫ్రికా పేస్ సంచలనమైన మోర్కెల్ వన్డేల్లో కోహ్లీని 8 సార్లు, రోహిత్‌ను ఏడుసార్లు ఔట్ చేశాడు. నవంబర్ 30న భారత్, దక్షిణాఫ్రికా మధ్య రాంచీలో మూడు వన్డేల సిరీస్ షురూ కానుంది.
Rohit Sharma, Virat Kohli and team India in practice session at JSCA stadium Ranchi.🇮🇳❤️ pic.twitter.com/MHUiwEIpvu
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 28, 2025