IND vs PAK | పాక్‌ను తిప్పేసిన దీప్తి, చరణి .. వరల్డ్‌కప్‌ను ఘనంగా ఆరంభించిన భారత్..!
IND vs PAK : ఐసీసీ టోర్నీల్లో మరోసారి భారత జట్టు జోరుకు పాకిస్థాన్ తలొగ్గింది. మహిళల టీ20 ప్రపంచకప్ లీగ్ దశ తొలి మ్యాచ్‌లో 170 పరుగుల ఛేదనలో పాక్‌కు టీమిండియా స్పిన్నర్లు ముచ్చెమటలు పట్టించారు.
IND vs PAK : ఐసీసీ టోర్నీల్లో మరోసారి భారత జట్టు జోరుకు పాకిస్థాన్ తలొగ్గింది. మహిళల టీ20 ప్రపంచకప్ లీగ్ దశ తొలి మ్యాచ్‌లో 170 పరుగుల ఛేదనలో పాక్‌కు టీమిండియా స్పిన్నర్లు ముచ్చెమటలు పట్టించారు. బర్మింగ్హమ్లో స్పిన్నర్లు దీప్తి శర్మ(5-10). శ్రీ చరణి(3-21)లు దాయాది టాపార్డర్‌ను కూల్చివేయడంతో పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో ఓడించింది. తొలుతు ఓపెనర్ స్మృతి మంధాన(68) అర్ధ శతకంతో కదం తొక్కగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(36) కెప్టెన్ ఇన్నింగ్స్, రీచా ఘోష్() తుఫాన్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయారు.
పొట్టి ప్రపంచకప్ ఆరంభ పోరులో భారత్ జయభేరి మోగించింది. మెగాటోర్నీలో దాయాదిపై రికార్డును కొనసాగిస్తూ హర్మన్‌ప్రీత్ సేన 64 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. 171 పరుగుల ఛేదనలో ఓపెనర్ మునీబా అలీ(41) ఒక్కామే దూకుడుగా ఆడినా.. దీప్తి శర్మ(5-10), శ్రీ చరణి(3-23)లు తిప్పేసి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పారు. ఓవర్లో రెండు వికెట్లు తీసిన దీప్తి ఐదో వికెట్ సాధించింది. దాంతో, పాక్ అదే తడబాటుతో 110 పరుగులకే ఆలౌటైంది.
Comfortable. Clinical. India get the job done in Birmingham 👏 pic.twitter.com/QACKRHZ23o
— ESPNcricinfo (@ESPNcricinfo) June 14, 2026
మంధాన మెరుపులతో..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఆదిలోనే పాక్ బౌలర్లు కష్టాల్లోకి నెట్టారు. షఫాలీ వర్మ(5), జెమీమా రోడ్రిగ్స్(1)లు విఫలమైనా ఓపెనర్ స్మృతి మంధాన(68) నిలబడింది. దాయాది బౌలర్లను కాచుకున్న మంధాన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(36)తో కలిసి జట్టును ఆదుకుంది. కౌర్ స్టాండ్ ఇవ్వగా.. మంధాన అటాకింగ్ గేమ్‌తో పాక్ బౌలింగ్ దళాన్ని చీల్చి చెండాడింది.

రెండుసార్లు మంధానను ఔట్ చేసే అవకాశాన్ని పాక్ ఫీల్డర్లు నేలపాలు చేశారు. బౌండరీలతో విరుచుకుపడిన మంధాన అర్ధ శతకంతో జట్టుకు మంచి స్కోరందించింది. కానీ, స్వల్ప తేడాకే కౌర్, మంధాన ఔటవ్వగా.. డెత్ ఓవర్లలో రీచా ఘోష్(34) బ్యాట్ ఝులిపించింది. దీప్తి శర్మ(12)తో కలిసి ధనాదన్ ఆడిన రీచా.. తస్మియా రుబాబ్ వేసిన 19వ ఓవర్లో 4, 6, 4, 4తో 23 రన్స్ పిండుకుంది. చివరి ఓవర్లో 15 పరుగులే రావడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

