న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఖోఖో ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 71-34తో భుటాన్పై ఘన విజయం సాధించింది. దీంతో టాప్-ఏలో ఉన్న టీమ్ఇండియాకు క్వార్టర్స్ బెర్తు ఖాయమైంది.
ఆది నుంచే తమదైన దూకుడు కొనసాగించిన భారత్ తొలి టర్న్లోనే 32 పాయింట్ల ఆధిక్యం ప్రదర్శించింది. అద్బుతమైన డైవింగ్ స్కిల్స్ ప్రదర్శించింది. మరోవైపు భారత మహిళల జట్టు 100-20తో మలేషియాను చిత్తుగా ఓడించి క్వార్టర్స్లోకి ప్రవేశించింది.