Inida – Australia Series : ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు వైట్ బాల్ సిరీస్ కోసం అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ అభిమానులు ఇప్పటి నుంచే సిరీస్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో, టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. టికెట్స్ అమ్మకాలు మొదలుపెట్టడమే ఆలస్యం హాట్‌కేకుల్లా కొనేశారు ఫ్యాన్స్. మూడో వన్డేకు వేదికైన సిడ్నీ, కాన్బెర్రాలో జరుగబోయే తొలి టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలను ప్రారంభించగా.. పూర్తిగా సేల్ అయ్యాయని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.
‘అక్టోబర్ – నవంబర్ మధ్య భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్ జరుగనుంది. ఫ్యాన్స్ అయితే ఈ సిరీస్‌పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా ప్రవాస భారతీయులు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాలుగు నెలలకు ముందే సిడ్నీలో వన్డే, కాన్బెర్రాలో టీ 20 మ్యాచ్ టికెట్లును పూర్తిగా అమ్ముడుపోయాయి. గబ్బాలో జరుగబోయే టీ20కి టికెట్లకు కూడా ఫుల్ డిమాండ్ నెలకొంది’ అని గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
Our men’s team white-ball fixtures against India in October are selling fast!
All other games 🎟️ – https://t.co/7JX5CCPZUa? pic.twitter.com/LKjmdL5ZSf
— Cricket Australia (@CricketAus) June 16, 2025
యాషెస్ సిరీస్‌కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అలానే భారత్ – ఆసీస్ సిరీస్ పట్ల కూడా అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు. అక్టోబర్‌లో టీమిండియా 8 మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ కోసం కంగారు గడ్డపై అడుగుపెట్టనుంది. దాంతో, క్రికెట్ ఆస్ట్రేలియా ఈమధ్యే మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభించింది. ఆశ్చర్యంగా.. రెండు వారాల్లోనే 90 వేల టికెట్లు అమ్మకాలు జరిగాయి. భారత్ ఆర్మీ అనేది మా దేశంలో అతడి పెద్ద క్రికెట్ ఫ్యాన్ క్లబ్. ఈ క్లబ్ వాళ్లు ఏకంగా 2,400 టికెట్లు కొనగా.. ఇతర ఫ్యాన్స 1,400 టికెట్లు కొనేశారు అని క్రికెట్ ఆస్ట్రేలియా ఈవెంట్స్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ జోయెల్ మోరిసన్ తెలిపాడు.