హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పిలుపునిచ్చారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని రాజ్‌బహదూర్ హాల్లో నాల్గోవ రాష్ట్ర మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 18,19,20 తేదీల్లో నిజామాబాద్‌లో మహాసభలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూ ళ్లల్లో పెరుగుతున్న ఫీజులు, పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, నిరుద్యోగ సమస్య, హాస్టల్లో సౌకర్యాల కొరతపై మహాసభల్లో సమగ్రంగా చర్చించి, బలమైన పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్టు వివరించారు. ఈ కా ర్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేశ్, రాష్ట్ర నాయకులు చైతన్యయాదవ్, వంశీ వర్ధన్‌రెడ్డి, పవన్, అ నిల్, ఉస్మానియా వర్సిటీ అధ్యక్ష, కా ర్యదర్శులు ఉదయ్, లెనిన్, అరుణ్, ఆకాశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.