Chiranjeevi | 80,90ల సమయంలో తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన నటుడు పొన్నంబలం. సినిమా పరిశ్రమలోకి స్టంట్‌మ్యాన్‌గా అడుగుపెట్టి ఆ తర్వాత పవర్ ఫుల్ విలన్‌గా అలరించాడు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో విడుదలైన “కలియుగం” సినిమాతో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు పొన్నంబలం. కొద్ది రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం చిరంజీవి దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చు చేశారట.
పొన్నంబలం చాలా కాలంగా మానసిక, ఆరోగ్య సంబంధిత ఇబ్బందులతో కుదేలయ్యాడు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన మెగాస్టార్ చిరంజీవి నుంచి సహాయం కోరారు. చిరంజీవి వెంటనే స్పందించి, ఆయనకు కావల్సిన వైద్య సహాయం అందించారు.అయితే కోలుకున్న తర్వాత పొన్నంబలం మాట్లాడుతూ.. చిరంజీవి వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను. ఆయన నా ప్రాణాలను కాపాడారు. దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి, నా కిడ్నీ ట్రీట్మెంట్ చేయించారు అని పేర్కొన్నారు.
అయితే, పొన్నంబలం గతంలో కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడినప్పుడు, తమిళ చిత్ర పరిశ్రమలో కొందరు డయాలసిస్ కోసం మాత్రమే సహాయం అందించారు. కానీ చిరంజీవి మాత్రం తన ప్రాణాన్ని కాపాడేందుకు పూర్తి స్థాయిలో సహాయం చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే చికిత్స తర్వాత నుండి పొన్నంబలం బాగానే ఉన్నా, తాజాగా మళ్లీ అనారోగ్య సమస్యలకు గురయ్యారట. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం . అయితే, ఈ సారి ఆయనకు ఏమైంది అనే విషయంపై ఇంకా పూర్తి సమాచారం లేదు, కానీ ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సినీ ప్రియులు ఆయన తర్వగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.