ఫోన్లో వేల కొద్దీ ఫొటోలు, ఫ్యామిలీ వీడియోలు, ముఖ్యమైన ఆఫీస్ డాక్యుమెంట్లు ఉన్నాయి కదా? వాటిని ఎలా భద్రపరిచారు అని అడిగితే.. ‘నేను గూగుల్ ఫొటోస్‌లో పెట్టాను’ లేదా ‘ఓ పెన్ డ్రైవ్‌లో దాచాను’, ‘నా దగ్గర పెద్ద హార్డ్ డ్రైవే ఉంది!’ అని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతారు. అయితే, ఫైల్స్ క్లౌడ్లోనో లేదా హార్డ్ డిస్క్లోనో ఉన్నాయంటే అంతా సేఫ్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే.. ఇక్కడ చాలామంది బ్యాకప్‌ని ఒక ‘పద్ధతి’లా కాకుండా ‘పని’లా చేస్తున్నారు. దీంతో డేటా పోయినప్పుడు ఆ బ్యాకప్ ఫైల్స్ పని చేయకపోవడం లేదా కావాల్సిన సెట్టింగ్స్ తిరిగి రాకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అదేంటి ఇంతకన్నా ఏం చేయాలి? అని కంగారు పడుతున్నారా! మీరు చేస్తున్నది బ్యాకప్ కాదు, కేవలం ‘కాపీ’ మాత్రమే! ఏదో ఓ రోజు మీ అకౌంట్ హ్యాక్ అయినా లేదా ఆ పెన్ డ్రైవ్ పాడైపోయినా మీ డేటా మొత్తం గాలిలో కలిసిపోతుంది. డేటా బ్యాకప్ విషయంలో మీరు చేస్తున్న పొరపాట్లు ఏంటి? అసలు ఓ ప్రొఫెషనల్ లాగా డేటాను ఎలా సేవ్ చేసుకోవాలి?
ఎప్పుడైతే క్లౌడ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయో.. యూజర్లు ‘హమ్మయ్యా! ఇక మన డేటా ఎక్కడికీ పోదులే’ అనుకుంటూ.. సింక్ చేసేస్తున్నారు. గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ లాంటి ఇతర సర్వీసుల మీదనే పూర్తి భరోసా పెడుతున్నారు. అంతేకాదు.. ఆయా సర్వీసులు అందించే ఫీచర్స్‌ని వాడుకుంటూ చక్కగా ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక్కడ యూజర్లు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. క్లౌడ్ స్టోరేజ్ అనేది కేవలం ‘సింక్’ చేసే సాధనం మాత్రమే. అంటే.. మీ లాకర్‌కి సింక్ సర్వీసులు ఓ సిమ్యులేషన్ ఫ్లాట్‌ఫామ్‌లు మాత్రమే అన్నమాట.
మార్చుకోవాల్సిన అలవాట్లు
పాస్వర్డ్ ప్రొటెక్షన్
‘3-2-1’ ఫార్ములా!
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్