ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదో టెస్టు(ENGvIND)లో.. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తొలి రోజు భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 72 రన్స్ చేసింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే ఓపెనర్ జైస్వాల్ కేవలం రెండు రన్స్‌కే నిష్క్రమించాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. ఇద్దరు ఓపెనర్లను కోల్పోయిన తర్వాత.. ప్రస్తుతం ఇండియా నిలకడగా ఆడుతోంది.
క్రీజ్‌లో కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు. ఆ ఇద్దరూ నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. వాస్తవానికి భోజన విరామ సమయానికి కొంచం ముందే ఓవల్ మైదానంలో వర్షం కురిసింది. దీంతో లంచ్ తీసుకున్నారు. భోజన విరామ సమయానికి సాయిసుదర్శన్ 25, గిల్ 15 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లు క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక జోష్ టంగ్, జేమీ ఓవర్టన్‌లు.. తమ లెన్త్ రాబట్టేందుకు ఇబ్బందిపడ్డారు.
Lunch on Day 1
Sai Sudharsan and Captain Shubman Gill at the crease 👍#TeamIndia reach 72/2
Updates ▶️ https://t.co/Tc2xpWMCJ6#ENGvIND pic.twitter.com/kIjaxNLhJa
— BCCI (@BCCI) July 31, 2025