ముంబై : ఈనెల 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు గాను యువ వికెట్‌కీపర్ బ్యాటర్ జి. కమలిని, లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మకు జట్టులో తొలిసారిగా చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీఐ.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.
వన్డే ప్రపంచకప్ నెగ్గిన జట్టులో పెద్దగా మార్పులేమీ లేకపోయినా మలేషియాలో ముగిసిన అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో రాణించిన కమలిని, వైష్ణవి సెలెక్టర్ల నమ్మకాన్ని చూరగొన్నారు. సీనియర్ ఉమెన్స్ ట్రోఫీలో వైష్ణవి 21 వికెట్లు పడగొట్టింది. తెలుగు క్రికెటర్లు శ్రీచరణి, అరుంధతి రెడ్డి తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, అమన్‌జ్యోత్ కౌర్, అరుంధతిరెడ్డి, క్రాంతిగౌడ్, రేణుకాసింగ్ ఠాకూర్, రిచా ఘోష్, కమలిని, శ్రీచరణి, వైష్ణవి