T20 World Cup | దుబాయ్: బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కారణంగా యూఏఈలో నిర్వహించతలపెట్టిన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సవరించిన షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా దుబాయ్, షార్జా వేదికలుగా జరగుబోయే ఈ మెగా టోర్నీలో భారత్.. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ద్వారా టైటిల్ వేటను ఆరంభించనుంది. దాయాది పాకిస్థాన్‌తో 6న తలపడనుంది. గ్రూపు దశలో టీమ్ఇండియా.. 9న శ్రీలంకతో 13న ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది.
ఈ టోర్నీలో తలపడబోయే పది జట్లను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 17న తొలి సెమీస్ (దుబాయ్) 18న రెండో సెమీస్ (షార్జా) జరగాల్సి ఉండగా 20న దుబాయ్ వేదికగా ఫైనల్‌ను నిర్వహించనున్నారు.