సౌతాంప్టన్ : ఇంగ్లండ్ గడ్డపై వరుసగా మూడు ఓటములతో సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు పరువైనా దక్కించుకోవాలని చూస్తోంది. ఐదు టీ20ల సిరీస్‌లో శనివారం జరిగే ఆఖరి పోరులో అయినా గెలిచి వైట్‌వాష్ ప్రమాదాన్ని తప్పించుకోవడమే లక్ష్యంగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేకపోయిన అయ్యర్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు.
ఇంగ్లండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ వేగాన్ని తట్టుకోలేక భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతుండగా.. చక్రవర్తి, హర్షిత్ గాయాల పాలుకావడం, రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులివ్వడం బౌలింగ్ విభాగాన్ని దెబ్బతీసింది. ఆఖరి మ్యాచ్‌లో జట్టు ఏం చేస్తుందో చూడాలి.