బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ వంటి టాప్ షట్లర్లు తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించి ప్రిక్వార్టర్స్ చేరగా ఆయుష్ శెట్టి, హైదరాబాదీ మన్నెపల్లి తరుణ్, తన్వి శర్మ మొదటి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సింధు.. 21-19, 21-12తో టుంగ్ సియు టాంగ్‌ను చిత్తుచేసింది.
మరో మ్యాచ్‌లో మాళవిక బన్సోద్.. 13-21, 26-24, 21-13తో వెన్ యు జాంగ్ (కెనడా)ను ఓడించగా దేవిక.. 21-19, 13-21, 21-15తో జపాన్ షట్లర్ నట్సుకి నిదైరను ఇంటికి పంపించింది. ఉన్నతి హుడా, తన్వి శర్మ ఓటమిపాలయ్యారు. మెన్స్ సింగిల్స్‌లో శ్రీకాంత్.. 21-14, 21-15తో లొ కీన్ యూ (సింగపూర్)ను ఓడించాడు. లక్ష్యసేన్ 21-16, 21-17తో జేసన్ (సింగపూర్)ను మట్టికరిపించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టొ-ధృవ్ కపిల ద్వయం 9-21, 15-21తో క్రిస్టియన్సెన్-అలెగ్జాండ్ర (డెన్మార్క్) చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.