Duleep Trophy : దులీప్ ట్రోఫీలో ‘ఇండియా ఏ’ ఘన విజయం సాధించింది. తొలి రోజు నుంచి అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ సేన ‘ఇండియా డీ’పై 186 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(111), ప్రథమ్ సింగ్(122)లు సెంచరీలతో ఇండియా డీ బౌలర్ల భరతం పట్టారు. ఆ తర్వాత బంతి అందుకున్న తనుష్ కొతియాని(4/73), శామ్స్ ములానీ(3/117)లు ఇండియా డీని కుప్పకూల్చారు.
ఇండియా ఏ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రికీ భూయి(113) సెంచరీ కొట్టినా జట్టుకు ఓటమి తప్పించలేకపోయాడు. బ్యాటుతో, బంతితో రాణించిన శామ్స్ ములానీ(89, 3/117) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇండియా బీ, ఇండియా సీల మధ్య ఉత్కంఠ సాగిన మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది.
𝐕𝐢𝐜𝐭𝐨𝐫𝐲 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 𝐀! 👏
They bowl India D out for 301 to win by 186 runs 👌👌
4⃣wickets for Tanush Kotian
3⃣ wickets for Shams Mulani
1⃣ wicket each for Khaleel Ahmed & Riyan Parag#DuleepTrophy | @IDFCFIRSTBankScorecard ▶️: https://t.co/m9YW0HttaH pic.twitter.com/ZSa4eZLJMs
— BCCI Domestic (@BCCIdomestic) September 15, 2024
దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో ‘ఇండియా ఏ’ దుమ్మరేపింది. ఇప్పటివరకూ టీ20ల్లో దంచేసిన తిలక్ వర్మ(111) రెడ్ బాల్ క్రికెట్లోనూ వీర కొట్టుడు కొట్టాడు. మరో ఎండ్‌లో ప్రథమ్ సింగ్(122) కూడా రెచ్చిపోయి ఆడాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌ను ఇండియా ఏ 380 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా డీని యశ్ దూబే(37), రికీ భూయి (113)లు ఆదుకున్నారు. రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో గెలుపు దిశగా నడిపారు. అయితే.. కొతియాన్, ములానీల విజృంభణతో ఇండియా డీ మిడిలార్డర్ పెవిలియన్ చేరింది. సంజూ శాంసన్(40) చివర్లో పోరాడినా సరిపోలేదు.
💯 for Ricky Bhui 🙌
He gets there in style 👌
A splendid knock so far in the fourth innings #DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/WM6ae4iOcv
— BCCI Domestic (@BCCIdomestic) September 15, 2024
ఉత్కంఠగా సాగిన ఇండియా బీ, ఇండియా సీల మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలుత ఇషాన్ కిషన్(111) విధ్వంసక సెంచరీ, మానవ్ సుతార్ (82), బాబా ఇంద్రజిత్(78), రుతురాజ్ గైక్వాడ్(58)ల వీరబాడుతో ఇండియా సీ తొలి ఇన్నింగ్స్‌లో 525 రన్స్ కొట్టింది. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా బీని కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(157 నాటౌట్) ఆదుకున్నాడు.
అభిమన్యు ఈశ్వరన్(157 నాటౌట్)
తొలి వికెట్‌కు జగదీశన్(74)తో కలిసి 129 రన్స్ జోడించిన అభిమన్యు పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అయితే.. ఆ తర్వాత అతడికి సహకరించేవాళ్లు కరువయ్యారు. పేసర్ అన్షుల్ కంబోజ్ 8 వికెట్లతో ఇండియా బీ నడ్డి విరిచాడు. అతడి దెబ్బకు అభిమన్యు బృందం 332 పరుగలకే ఆలౌటయ్యింది. ఆ తర్వాత ఇండియా సీ 128 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.