కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనలో చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ స్పందించారు. రాహుల్ గాంధీ భారతీయడు కాదని, ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని అన్నారు. విదేశీ పర్యటనల్లో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు. రవ్నీత్ బిట్టూ ఆదివారం బిహార్‌లోని భాగల్పూర్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
వేర్పాటువాదులు, బాంబులు, తుపాకీలు తయారుచేసేవారు, మోస్ట్ వాంటెడ్ పీపుల్ వంటి మారు మాత్రమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. విమానాలు, రైళ్లు, రహదారులను తగులబెట్టే దేశ శత్రువులే రాహుల్‌ను సమర్దిస్తారని వ్యాఖ్యానించారు. దేశానికి అతిపెద్ద శత్రువు, నెంబర్ వన్ టెర్రరిస్ట్‌ను ఎవరినైనా పట్టుకోవాలంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు భారత్ గురించి చెడుగా మాట్లాడటం అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ అంతకుముందు ఆరోపించారు. ఈసీ వంటి భారత రాజ్యాంగ వ్యవస్ధలను కూడా ఆయన తూలనాడుతుంటారని అన్నారు. బీజేపీ రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల్లో రాహుల్ గాంధీ గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు. అసలు రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన రాహుల్ గాంధీ మెదడులో ఉందనే విషయం ఇప్పుడు వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు.
Read More :
Chhattisgarh | దారుణం.. మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య..!