కాన్పూర్: ఆస్ట్రేలియా ‘ఏ’తో జరిగిన మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ను భారత ‘ఏ’ జట్టు 2-1తో నెగ్గింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా నిర్దేశించిన 317 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత్ 46 ఓవర్లలోనే 8 వికెట్లు కోల్పోయి దంచేసింది.
ఛేదనలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (102) మెరుపు శతకానికి తోడు శ్రేయాస్ (62), రియాన్ (62) సమయోచిత ఇన్నింగ్స్‌తో సిరీస్ భారత సొంతమైంది.