భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళలు ఇరగదీశారు. టాపార్డర్ బ్యాటర్లంతా ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ చేరినా లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఆష్లీ గార్డనర్ (52 నాటౌట్) అద్భుతంగా పోరాడి ఆసీస్ జట్టుకు విజయం అందించింది. ఆమె అసాధారణ పోరాటంతో కామన్వెల్త్ గేమ్స్‌లో మొట్టమొదటిసారిగా జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళలు ఓటమి చవిచూడక తప్పలేదు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. హర్మన్‌ప్రీత్ కౌర్ (52), షెఫాలీ వర్మ (48) రాణించడంతో 20 ఓవర్లలో 154/8 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో రేణుకా సింగ్ (4/18) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆసీస్ జట్టు 41/4 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నాలుగు వికెట్లను రేణుకానే తీయడం గమనార్హం.
ఆమె బౌలింగ్ ఆడలేక అలిస్సా హేల (0), బెత్ మూనీ (10), మెగ్ లానింగ్ (8), తహిలా మెక్‌గ్రాత్ (14) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత దీప్తి శర్మ బౌలింగ్‌లో రచెల్ హేన్స్ (9) కూడా అవుటైంది. ఇలాంటి సమయంలో ఆష్లీ గార్డనర్తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించిన గ్రేస్ హారిస్ (37)ను మేఘనా సింగ్ అవుట్ చేసింది.
జెస్ జోనాసెన్ (3)ను దీప్తి శర్మ పెవిలియన్ పంపింది. ఇక భారత విజయం దాదాపు ఖాయమే అనుకున్న సమయంలో గార్డనర్తోపాటు అలానా కింగ్ (18 నాటౌట్) కూడా రాణించింది. దాంతో భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఆసీస్ మహిళలు ఛేదించారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లతో అదరగొట్టగా.. దీప్తి శర్మ 2, మేఘనా సింగ్ ఒక వికెట్ తీసుకున్నారు.
INCREDIBLE! A heroic effort from Ashleigh Gardner (52* off 35) helps the Aussies back from the brink to seal a narrow three-wicket win.
What a start to the Games! Scorecard: https://t.co/A8dip64qNe #AUSvIND #BoldInGold pic.twitter.com/aT3NLePoFz
— Australian Women's Cricket Team 🏏 (@AusWomenCricket) July 29, 2022