IND vs ZIM | టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో జింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (15) నిరాశపరిచినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (61) చెలరేగి ఆడాడు. 25 బంతుల్లోనే 61 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ (51) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. విరాట్ కోహ్లీ (26) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 186 పరుగులు చేసింది.
అంతకుముందు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడటంతో ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం లేకుండానే టీమిండియా సెమీస్‌కు చేరింది. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్ కూడా సెమీస్‌కు చేరుకుంది.
PAK vs BAN | సెమీస్‌కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు