PAK vs BAN | సెమీస్‌కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు
PAK vs BAN |సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు అమీతుమీ జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్ 2 నుంచి సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.
PAK vs BAN |సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు అమీతుమీ జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్ 2 నుంచి సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. అంతకుముందు పసికూన నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడిపోవడంతో టాప్‌లో ఉన్న టీమిండియా డైరెక్ట్‌గా సెమీస్‌కు వెళ్లింది.
తొలుత పాకిస్థాన్‌పై టాస్ గెలిచి బంగ్లాదేశ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. షింటో ( 54) ఒక్కడు హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాకిస్థాన్ బౌలర్ల ధాటికి మిగిలిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. గత మ్యాచ్‌లో భారత్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడిన లిటన్ దాస్ 10 పరుగులకే ఔటయ్యాడు. సౌమ్య సర్కార్ (20), ఆసిఫ్ హుస్సేన్ (24) రెండంకెల స్కోర్ చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 127 పరుగులు మాత్రమే చేసింది.
128 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ నిలకడగా ఆడి టార్గెట్‌ను చేధించింది. ఓపెనర్లు బాబర్ ఆజాం (32), మహమ్మద్ రిజ్వాన్ (25) రాణించారు. వీళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ హరిష్ ( 31 ) మెరిశాడు. షాన్ మసూద్ (22 ) కూడా ఫర్వాలేదనిపించాడు. మొత్తమ్మీద 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించారు. ఫలితంగా బంగ్లాదేశ్‌పై గెలుపొంది సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నారు.
Read More :
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

