జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వేను 161 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచాడు. అయితే శిఖర్ ధావన్ (33), శుభ్‌మన్ గిల్ (33) రాణించారు. ఇషాన్ కిషన్ (6) విఫలమవగా.. దీప్ హుడా (25) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్ (43 నాటౌట్) మరోసారి సత్తాచాటాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 26వ ఓవర్లో భారత విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా.. సిక్సర్‌తో విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో జింబాబ్వే సిరీస్‌ను భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. జింబాబ్వే బౌలర్లలో ల్యూక్ జాంగ్వే రెండు వికెట్లతో సత్తా చాటగా.. తలన చివాంగ, విక్టర్ న్యూచి, సికందర్ రజా తలో వికెట్ తీసుకున్నారు.
💥🇮🇳 SERIES VICTORY! Congratulations to KL Rahul on winning his first ODI series as captain!
🙌🏻 Good work, team!
📸 Getty • #INDvZIM #ZIMvIND #TeamIndia #BharatArmy pic.twitter.com/nsWwPLMkfA
— The Bharat Army (@thebharatarmy) August 20, 2022