స్వల్పలక్ష్య ఛేదనలో అదిరిపోయే ఆరంభం లభించినా కూడా దాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. రోహిత్ (60), ఇషాన్ కిషన్ (28) మంచి ఆరంభం అందించారు. కానీ రోహిత్ అవుటైన తర్వాత కోహ్లీ (8) అనవసర షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరగా.. సూర్యకుమార్ యాదవ్ కొట్టిన స్ట్రెయిట్ షాట్‌కు దురదృష్టవశాత్తూ రిషభ్ పంత్ (11) బలయ్యాడు.
దీంతో 116/4తో కష్టాల్లో పడిన జట్టును సూర్యకుమార్ యాదవ్ (22 నాటౌట్), దీపక్ హుడా (12 నాటౌట్) ఆదుకున్నారు. వీళ్లిద్దరూ చెత్త షాట్లకు వెళ్లకుండా సంయమనంతో ఆడుతూ.. భారత జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే 23వ ఓవర్ ముగిసే సరికి భారత జట్టు 152/4 స్కోరు చేసింది. కీలక వికెట్లు కోల్పోయిన భారత జట్టు విజయావకాశాలు వీరిపైనే ఆధారపడి ఉన్నాయి.