IND vs SL : శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ (4) పెవిలియన్ చేరాడు. లహిరు కుమార ఇన్స్వింగర్త్ కోహ్లీని బోల్తా కొట్టించాడు. ఖాతా తెరవడానికి 8 బంతులు తీసుకున్న కోహ్లీ ఫోర్ బాది ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కానీ, ఆ తర్వాతి బంతికే వికెట్ సమర్పించుకున్నాడు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువకే పెవిలియన్ చేరడంతో టీమిండియా ఒత్తిడిలో పడింది. శుభ్‌మన్ గిల్ (21) రోహిత్ శర్మ (17) తక్కువకే వెనుదిరిగారు. ప్రస్తుతం అయ్యర్ 13, కేఎల్ రాహుల్ 6 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి భారత్ 72 పరుగులు చేసింది.