రెండో టీ20లో గెలిచి శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మశాల వేదికగా రెండో మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20 ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని, అదే జట్టుతో బరిలో దిగుతున్నామని రోహిత్ శర్మ చెప్పాడు.
అదే సమయంలో శ్రీలంక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వాండర్సే, లియనాగె బెంచ్‌కు పరిమితవగా.. బినురా ఫెర్నాండో, దనుష్క గుణతిలకకు జట్టులో చోటు దక్కింది. ధర్మశాల పిచ్‌పై కొంత పచ్చిక ఉందని, స్వింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని మ్యాచ్ ప్రారంభానికి ముందు మాజీ ఆటగాడు అజిత్ అగార్కర్ అంచనా వేశాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్
శ్రీలంక జట్టు: పాథున్ నిశ్శంక, కమిల్ మిషార, చరిత్ ఆశలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), దాసున్ షానక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీష్ జయవిక్రమ, బినురా ఫెర్నాండో, లాహిరు కుమార.
Captain @ImRo45 wins the toss and elects to bowl first in the 2nd T20I.
An unchanged Playing XI for #TeamIndia
Live – https://t.co/ImBxdhXjSc #INDvSL @Paytm pic.twitter.com/DdEebeL2rP
— BCCI (@BCCI) February 26, 2022