IND vs SL | లఖ్నవూ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా దూకుడు ప్రదర్శించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆటగాళ్లు చెలరేగి ఆడారు. రోహిత్ శర్మ (44) పరుగులతో రాణించాడు. ఇషాన్ కిషన్ (89), శ్రేయస్ అయ్యర్ (57) చెరో హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 199 పరుగులు చేసింది.