శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (1) అవుటయ్యాడు. అంతకుముందు లంక కెప్టెన్ దాసున్ షానక (19 బంతుల్లో 47 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో భారత్ ముందు 184 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ పిచ్‌పై ఇది పెద్ద టార్గెట్టే అని నిపుణుల అభిప్రాయం. లక్ష్య ఛేదనలో టీమిండియాను దుష్మంత చమీరా దెబ్బకొట్టాడు.
తొలి ఓవర్లోనే రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవలగా చమీరా వేసిన బంతిని కిందకు కొట్టేందుకు రోహిత్ ప్రయత్నించాడు. కానీ ఆ బంతి రోహిత్ వైపుగా వచ్చి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లకు తగిలింది. దీంతో ఒక్క పరుగుకే రోహిత్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్‌తోపాటు శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు.