Tilak Varma | టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో పరుగులు చేసేందుకు ఇబ్బందిపడుతున్నాడు. దాంతో టీమిండియా కెప్టెన్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సూర్యకు టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ మద్దతు ప్రకటించాడు. తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు కెప్టెన్‌కు కేవలం ఒకే ఇన్నింగ్ సరిపోతుందని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో సూర్య భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వచ్చే ఏడాదిలో టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. మెగా ఈవెంట్‌కు ముందు కెప్టెన్ ఫామ్‌లో లేకపోవడంతో ఆందోళనకు గురి చేస్తున్నది. సూర్యకుమార్ చాలాకాలంగా పరుగులు చేయలేకపోతున్నాడు. భారత జట్టు దక్షిణాఫ్రికాను 3-1 తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును కూడా శనివారం బీసీసీఐ ప్రకటించనున్నది. సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20 అనంతరం సూర్య కుమార్ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. కొన్ని బంతులను సౌకర్యవంతంగా ఆడాలని సూర్యకు సూచించినట్లు తెలిపాడు. కొద్దిగా వేచి ఉండాలని.. అతను క్రీజులో కొంత వరకు సమయం గడపాలన్న తిలక్.. సూర్యకుమార్ తిరిగి ఆత్మవిశ్వాసంతో ఆడితే ఎంత ప్రమాదకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందేనన్నాడు. బ్యాటింగ్ సమయంలో కొన్ని బంతులను ఎదుర్కొంటే ఫీల్డర్ల మీదుగా కొన్ని షాట్లు కొట్టేందుకు ప్రయత్నించాలని చెప్పానని.. గ్యాప్స్‌లో ఆడేందుకు ప్రయత్నించాలని సూచించినట్లు చెప్పాడు. ఎవరైనా బ్యాట్స్‌మెన్ అలా చేయగలిగితో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని.. ఫీల్డ్ గురించి అవగాహన వస్తుందని.. ఆ తర్వాత భారీ షాట్లు ఆడవచ్చని తిలక్ వర్మ చెప్పాడు.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది భారత్ తరఫున టీ20ల్లో సూర్య నిరాశ పరిచాడు. 19 ఇన్నింగ్స్‌లో 13.62 సగటుతో కేవలం 2018 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేదు. ఈ ఫార్మాట్లో భారత్‌కు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలర్లని తిలక్ తెలిపాడు. ఇతర ఫాస్ట్ బౌలర్లతో పోలిస్తే బుమ్రా బౌలింగ్‌లో ఒక ప్రత్యేకత ఉందని.. వరుణ్లోనూ ప్రత్యేకతలున్నాయని చెప్పాడు. ఇద్దరు జట్టుకు వికెట్లు అవసరమైన సమయంలో సాధించి పెడుతారని.. అంచనాలకు అనుగుణంగా రాణిస్తారని తెలిపాడు. వరుణ్ సిరీస్‌లో రాణించాడని.. చివరి టీ20లో ఒత్తిడిలో ఉన్న సమయంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడని చెప్పాడు.