Rishabh Pant | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న కోల్‌కతాలో టెస్ట్‌లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఓ మైల్స్టోన్ చేరుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్స్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ 24 బంతుల్లో 27 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇందులో పంత్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. దాంతో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. పంత్ 83 టెస్ట్ ఇన్సింగ్స్‌లో 92 సిక్సర్లు బాదాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 180 ఇన్నింగ్స్‌లలో 91 సిక్సర్లు కొట్టాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 116 ఇన్నింగ్స్‌లలో 88 సిక్సర్లు బాది మూడో స్థానంలో ఉన్నాడు. అలాగే, 130 ఇన్నింగ్స్‌లో 80, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ144 ఇన్నింగ్స్‌లో 78 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఇదిలా ఉండగా.. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు చేసి దక్షిణాఫ్రికా కంటే 30 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సమయంలో గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. భారత తొలి ఇన్నింగ్స్ తొమ్మిది వికెట్ల వద్ద ముగిసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులు చేసింది. భారత్ తరఫున కెఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వాషింగ్టన్ సుందర్ 29 పరుగులు చేశాడు. రాహుల్, వాషింగ్టన్ రెండో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రిషబ్ పంత్ (27), రవీంద్ర జడేజా (27), అక్షర్ పటేల్ (14), ధ్రువ్ జురెల్ (14), యశస్వి జైస్వాల్ (12), కుల్దీప్ యాదవ్ (1), మహ్మద్ సిరాజ్ (1) పరుగులు చేయగా.. బుమ్రా ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లు, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు దక్కగా.. కేశవ్ మహారాజ్, కార్బిన్ బాష్ తలా ఒక్కో వికెట్ తీశారు.
𝐀 𝐒𝐢𝐠𝐧𝐢𝐟𝐢𝐜𝐚𝐧𝐭 𝐅𝐞𝐚𝐭 🫡
Vice-captain Rishabh Pant now stands atop #TeamIndia’s all-time six-hitters list in Tests 🔥
Updates ▶️ https://t.co/okTBo3qxVH #INDvSA | @IDFCFIRSTBank | @RishabhPant17 pic.twitter.com/gLiXzuWcMF
— BCCI (@BCCI) November 15, 2025