IND Vs SA | దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ బుధవారం భారత జట్టును ప్రకటించింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు జట్టులో చోటు కల్పించడంతో పాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. గాయం తర్వాత కోలుకున్న ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్‌కు చోటు కల్పించింది. శుభ్‌మన్ గిల్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడరు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ఈ నెల 14న ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా-ఏతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతారు.
వెస్టిండిస్ టెస్ట్ సిరీస్ ఆడిన జట్టులోని ప్లేయర్స్ ఎక్కువ మందికి దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అవకాశం కల్పించింది బీసీసీఐ. సెలక్షన్ కమిటీ మరోసారి కరుణ్ నాయర్‌కు చోటు కల్పించలేదు. ఇటీవల రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. యశస్వీ జైస్వాల్, రాహుల్ ఇన్సింగ్స్ ప్రారంభిస్తారు. మూడోస్థానంలో సాయి సుదర్శన్ ఆడతాడు. దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌లో ఎవరో ఒకరు నాలుగో స్థానంలో ఆడే ఛాన్స్ ఉంది.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ నవంబర్ 14న జరుగుతుంది. జట్టులో నలుగురు, స్పిన్నర్లు, ముగ్గురు పేస్ బౌలర్లకు ఛాన్స్ ఇచ్చింది. అక్షర్ పటేల్, కుల్దీప్, సుందర్, జడేజా రూపంలో నలుగురు స్పిన్నర్లు.. బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ రూపంలో ముగ్గురు పేసర్లు ఉన్నారు. ఇక నితీశ్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా తీసుకుంది. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి గౌహతిలో జరుగుతుంది. ఆ తర్వాత రెండు జట్లు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు మూడు వన్డేలు ఆడనున్నాయి. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు రెండు జట్ల మధ్య ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతుంది.
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్- వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.ఽ
తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విపరాజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్సిమ్రాన్ సింగ్.