విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. తబ్రయిజ్ షంసీ వేసిన 13వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ (14) అవుటయ్యాడు. అంతకుముందు అదే ఓవర్లో ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. అయితే అయ్యర్ రివ్యూ కోరాడు. రివ్యూలో అతను నాటౌట్ అని తేలింది.
అదే ఓవర్ చివరి బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించిన అయ్యర్.. స్క్వేర్ లెగ్వైపుగా బంతిని గాల్లోకి లేపాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నోర్జీ ముందుకు జంప్ చేసి చక్కని క్యాచ్ అందుకోవడంతో అయ్యర్ పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత కాసేపటికే ప్రిటోరియస్ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన ఇషాన్ కిషన్ (54) కూడా అవుటయ్యాడు.
అతను గాల్లోకి లేపిన బంతిని డీప్ ఎక్స్ట్రా కవర్లో హెండ్రిక్స్ చక్కగా అందుకున్నాడు. దాంతో ఇషాన్ నిరాశగా మైదానం వీడాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 133 పరుగులతో నిలిచింది.