IND vs SA | దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ ప్యాండా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచుల సిరీస్ నవంబర్ 30న ప్రారంభం కానున్నది. గాయం కారణంగా హార్దిక్ కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం హార్దిక్ టీ20 క్రికెట్‌పై దృష్టి సారించినట్లుగా భావిస్తున్నారు. ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ల పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వన్డే సిరీస్ నుంచి బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ సందర్భంగా హార్దిక్ గాయం కారణంగా పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్లో ఆడలేకపోయాడు. హార్దిక్ గాయం నుంచి కోలుకుంటున్నాడు.
ఈ తరుణంలో నేరుగా మళ్లీ 50 ఓవర్ల క్రికెట్ ఆడడం ప్రమాదకరమయ్యే అవకాశం ఉంది. హార్దిక్ టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించాడు. తన ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు హార్దిక్ మొదట సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు సైతం ఆడుతుంది. ఐపీఎల్ తర్వాత సీనియర్ ప్లేయర్లు 2027 వన్డే ప్రపంచకప్‌పై దృష్టి సారించనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 22 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగనున్న రెండో టెస్ట్ కోసం భారత జట్టు గౌహతికి చేరుకుంది. రెండు మ్యాచుల సిరీస్‌లో ప్రస్తుతం భారత్ 0-1 తేడాతో వెనుకపడింది. సిరీస్‌ను సమయం చేయాలని భావిస్తుంది. అయితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడడం టీమిండియాను కలవరపెడుతున్నది. రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నదాంట్లో స్పష్టత లేదు.