భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో సఫారీలు తొలి వికెట్ కోల్పోయారు. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్ (4)ను బౌల్డ్ చేశాడు. సఫారీ బౌలర్లు రాణించిన పిచ్‌పై తను కూడా మంచి స్వింగ్‌తో బౌలింగ్ చేసిన భువీ.. తొలి ఓవర్ చివరి బంతికి హెండ్రిక్స్‌ను పెవిలియన్ చేర్చాడు.
భువీ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన హెండ్రిక్స్.. ఎలా ఆడాలని నిర్ణయించుకునేలోపే ఆ బంతి వికెట్లను కూల్చింది. దీంతో ఐదు పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది.