Security Breach | భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డేలోనూ సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. ఈ సిరీస్‌లో రెండో సెంచరీ చేసి మళ్లీ పూర్వపు ఫామ్‌లోకి వచ్చాడు. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కేవలం 90 బంతుల్లోనే కెరీర్లో 53వ వన్డే సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్ స్టేడియంలో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. వాస్తవానికి డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఓ అభిమాని పిచ్ వరకు వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి.. కింగ్ కోహ్లీ కాళ్లను మొక్కాడు. రాంచీ వన్డేలోనూ ఇలాంటి ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సమయంలో స్టేడియంలోని విరాట్ కాళ్లపై పడిపోయాడు. తాజాగా రాయ్‌పూర్ వన్డేలోనూ సెక్యూరిటీని తప్పించుకొని వచ్చిన ఓ అభిమాని విరాట్ కాళ్లను మొక్కాడు.
అయితే, గ్రౌండ్లో భద్రతా వైఫల్యంపై పలువురు విరాట్ అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఆ అభిమాని అదృష్టవంతుడని చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ వన్డేల్లో 53 సెంచరీలు చేశాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ (49) సెంచరీల రికార్డును అధిగమించిన విరాట్.. దక్షిణాఫ్రికాపై వరుస సెంచరీలతో మరోసారి సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డుకు మరింత చేరువయ్యాడు. రాయ్‌పూర్‌లో 84వ సెంచరీని సాధించిన రన్ మిషన్.. ఈ సెంచరీతో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో స్వదేశంలో తన సెంచరీల సంఖ్యను 40కి పైగా పెంచుకున్నాడు. ఈ లెజెండరీ జాబితాలో సచిన్ టెండూల్కర్ 42 సెంచరీలతో కోహ్లీ కంటే ముందున్నాడు. కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే కొద్ది రోజుల్లోనే ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.