పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ నిదానంగా సాగుతోంది. ఆరంభంలోనే రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ (15), అక్షర్ పటేల్ (2) వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో కోహ్లీ, హార్దిక్ పాండ్యా మరో వికెట్ పడకుండా నిదానంగా ఆడుతున్నారు.
భారీ షాట్లకు పోకుండా స్ట్రైక్ రొటేట్ చేయడంపైనే ఫోకస్ పెట్టారు. దీంతో స్కోరుబోర్డు చాలా నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే భారత జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 44 పరుగులతో నిలిచింది.