ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ పేస్ ఎటాక్ చాలా బలంగా ఉంటుంది. ఈ జట్టు ఆటతీరు ఎలా ఉన్నా వారి పేస్ బౌలింగ్ విభాగం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈసారి కూడా పొట్టి ప్రపంచక్‌లో ఆడుతున్న జట్లలో అద్భుతమైన పేస్ బౌలింగ్ యూనిట్ ఉన్న జట్లలో పాకిస్తాన్ ఒకటి. ఆసియా కప్‌లో అదరగొట్టిన నసీమ్ షా, పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిదీ, వెటరన్ హారిస్ రవూఫ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
ఇదే విషయాన్ని గుర్తుచేసిన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. పాక్ జట్టులో అఫ్రిదీ కన్నా ప్రమాదకరమైన పేసర్ మరొకరని అభిప్రాయపడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో షహీన్ షా అఫ్రిదీ ఆటతీరును మెచ్చుకున్న ఆకాశ్ చోప్రా.. అయితే ఇంకా అఫ్రిదీ తన టాప్ ఫామ్ అందుకోలేదన్నాడు.
‘ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత జట్టు జాగ్రత్త పడాల్సింది షహీన్‌తో అని నేను అనుకోవడం లేదు. అతను ఇంకా తన టాప్ ఫామ్ అందుకోలేదు. కాబట్టి కష్టమైన ఓవర్లన్నీ హారిస్ రవూఫ్ వేస్తాడని అనుకుంటున్నా. అదే సమయంలో ఈ ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా కూడా అతనికి ఉంది’ అని వివరించాడు. ఆసియా కప్‌లో కూడా హారిస్ రవూఫ్ అద్భుతంగా బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే.
But I do feel the bowler to be wary of on Sunday isn’t Shaheen. It’s Haris Rauf. Afridi is getting close to his best but isn’t there yet…and unlikely to be by the 23rd either. Rauf will bowl the tougher overs and has the potential to make a difference. #IndvPak #T20WorldCup
— Aakash Chopra (@cricketaakash) October 19, 2022