Asia Cup Controversy | ఆసియా కప్‌లో భాగంగా మరికొద్ది గంటల్లో భారత్-పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త వివాదానికి తెరలేపింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది. భారత బౌలర్ అసభ్యంగా సైగలు చేశాడని పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేసిందని సమా టీవీ వర్గాలను వార్తా సంస్థ ఏఎన్ఐ న్యూస్ పేర్కొంది. అర్ష్‌దీప్ సింగ్ ప్రవర్తనపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఈ ఫాస్ట్ బౌలర్ ప్రేక్షకులను ఉద్దేశించి అనైతికంగా సైగలు చేసి.. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని ఫిర్యాదులో ఆరోపించింది. అర్ష్‌దీప్ చర్యలు క్రికెట్‌కు చెడ్డ పేరును తీసుకువచ్చిందని.. రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించే ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పీసీబీ ఐసీసీని కోరినట్లుగా సమా టీవీ పేర్కొంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. వాస్తవానికి భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాకుండా.. అంతకుమించి భావోద్వేగాల సమరంగా భావిస్తారు. సరిహద్దుల్లో జరిగిన సైనిక ఘర్షణల వేడి ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించాయి. మాటల తూటాలు లేకపోయినా.. ఆటగాళ్లు తమ సైగలతోనే అగ్గిరాజేశారు. పాక్ ఆటగాళ్లు రొచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ ప్లేయర్ ఆటగాళ్లు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. భారత అభిమానులు కోహ్లీ, కోహ్లీ అంటూ నినదించడంతో పాక్ పేసర్ హరీస్ రవూఫ్ అసహనానికి గురయ్యాడు. సైనిక ఘర్షణల్లో భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లుగా.. మైదానంలో రెండుసార్లు విమానం కూలిపోతున్నట్లు సైగలు చేశాడు. పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ సైతం బ్యాట్‌ను ఏకే-47 తుపాకీలా పట్టుకుని భారత డగౌట్ వైపు గురిపెడుతున్నట్లుగా సైగలు చేశాడు. అయితే, వారికి అర్ష్‌దీప్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. హరీస్ రవూఫ్‌ను వెక్కిరిస్తూ, అర్ష్‌దీప్ కూడా విమానం కూలుతున్నట్లు చేసిన సైగలకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే, ఆ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడంటూ నెటిజన్లు ప్రశంసించారు.
ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు పాకిస్తాన్ బోర్డు సూర్యకుమార్ యాదవ్‌పై సైతం ఐసీసీకి రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14న జరిగి గ్రూప్ స్టేమ్ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలను పీసీబీ వ్యతిరేకించింది. పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు తాము అండగా నిలుస్తామని.. ధైర్యాన్ని ప్రదర్శించిన సాయుధ దళాలన్నింటికీ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, సూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ జరిమానా విధించింది. అలాగే, పాక్ ఆటగాళ్లు హరిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌కు సైతం జరిమానా విధించింది.
Arshdeep cooked rauf and we didn’t even notice…😭😭pic.twitter.com/IO8bIf8RZl
— B̷O̷D̷Y̷G̷U̷A̷R̷D̷ (@kohli_goat) September 23, 2025