భారత మహిళలతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో పాక్ మహిళలు పోరాడుతున్నారు. తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా చెయ్యలేకపోయిన ఆ జట్టు.. రెండో ఓవర్లోనే ఓపెనర్ ఇరామ్ జావెద్ (౦) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన కెప్టెన్ బిస్మా మరూఫ్ (17), మరో ఓపెనర్ మునీబా అలీ (32) ఇద్దరినీ స్నేహ్ రాణా ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చింది.
9వ ఓవర్లో బంతి అందుకున్న ఆమె.. బిస్మా మరూఫ్ను ఎల్బీడబ్ల్యూగా బుట్టలో వేసుకోగా, మునీబ్ నేరుగా ఆమెకే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. దీంతో పాక్ జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులతో నిలిచింది.