IND vs PAK Live Updates | భారత్‌తో రెండోసారి తాడోపేడో తేల్చుకునేందుకు పాకిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఆసియా కప్‌లో తమ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన దాయాది దేశం.. ఈ ఆదివారం మ్యాచ్‌లో గెలిచి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దాటిగా ఆడుతున్న పాక్‌కు షాక్ తగిలింది. రెండు కీలక వికెట్లను స్వల్ప వ్యవధిలోనే కోల్పోయింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో నవాజ్ (42), హార్దిక్ బౌలింగ్‌లో రిజ్వాన్ (71) వికెట్లు పడ్డాయి.
సూపర్-4లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ వేసిన 9వ ఓవర్లో ఫఖర్ జమాన్ (15) అవుటయ్యాడు.
బాబర్ అజామ్ ఔట్ అవడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే రిజ్వాన్ (24 నాటౌట్), ఫఖర్ జమాన్ (6 నాటౌట్) ధాటిగా ఆడారు. దాంతో పవర్‌ప్లే ముగిసే రికి పాకిస్తాన్ జట్టు 44/1 స్కోరుతో నిలిచింది.
భారత్ నిర్దేశించిన 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు నాలుగో ఓవర్లోనే షాక్ తగిలింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 14 పరుగులు చేసి రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అప్పటికి పాక్ స్కోరు 22 పరుగులు.
నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59) చెలరేగి ఆడటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
భారత్ 168 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. స్లో బంతిని భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన దీపక్ హుడా (16) పెవిలియన్‌కు చేరాడు. 19 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 171/6.
విరాట్ కోహ్లీ 36 బంతుల్లో అర్థ శతకం చేశాడు. హస్నైన్ వేసిన బంతిని సిక్స్‌గా మలిచిన కోహ్లీ (53*) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజ్‌లో కోహ్లీతో పాటు దీపక్ హుడా (15*) ఉన్నాడు. భారత్ స్కోరు 164/5.
ఇంతకుముందు మ్యాచ్‌లో పాక్‌పై చెలరేగి ఆడి భారత్‌కు విజయాన్ని అందించిన హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. హస్నైన్ బౌలింగ్‌లో నవాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 131 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
భారత్ 126 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో రివర్స్ షాట్‌కు యత్నించిన రిషభ్ పంత్ 14 పరుగులు చేసి ఔటయ్యాడు.
భారత్ 13 ఓవర్లు ముగిసే సమయానికి 118 పరుగులు చేసింది. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్న విరాట్ కోహ్లీ (33*), రిషభ్ పంత్ (9*) 20 బంతుల్లో 27 పరుగులు జోడించారు.
భారత్ స్కోరు వంద పరుగులు దాటింది. 11 ఓవర్లు ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (23*), పంత్ (2*) ఉన్నారు.
భారత్ మరో వికెట్ కోల్పోయింది. హాంగ్‌కాంగ్‌పై చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశ పరిచాడు. 10వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వేసిన బంతిని స్వీప్ చేసి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్యకుమార్.. ఆసిఫ్ అలీ చేతికి చిక్కాడు. భారత జట్టు పది ఓవర్లు ముగిసే సరికి 93/3 స్కోరుతో నిలిచింది.
ఓపెనర్లు ఔటవడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ (15) , సూర్యకుమార్ (12) దూకుడు పెంచారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ బాదుతూ పరుగులు రాబడుతున్నారు. దీంతో తొమ్మిదో ఓవర్ ముగిసే సమయానికి భారత్ 88 పరుగులు చేసింది.
స్వల్ప వ్యవధిలో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఇప్పుడు అదే భారీ షాట్‌కోసం ప్రయత్నించి కేఎల్ రాహుల్ (28).. బౌండరీ లైన్ వద్ద నవాజ్ చేతికి చిక్కాడు.
పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు 62/1 స్కోరుతో నిలిచింది. రోహిత్ శర్మ ఔటవడంతో క్రీజులోకి విరాట్ కోహ్లీ వచ్చాడు.
భారత్ 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. హారిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్.. ఖుష్దిల్ చేతికి చిక్కాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ(28 పరుగులు) తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
ఐదు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 54 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 26, కేఎల్ రాహుల్ 28 పరుగులు చేశారు.
నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 46 పరుగులు చేసింది. రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. హారిస్ బౌలింగ్‌లో ఒక సిక్స్, ఫోర్ సహా 12 పరుగులు రాబట్టాడు. అంతకుముందు నసీర్ షా వేసిన మూడో ఓవర్లో కేఎల్ రాహుల్ రెండు సిక్సర్లు బాదాడు.
రెండో ఓవర్ ముగిసే సమయానికి రోహిత్, రాహుల్ దూకుడుగా ఆడటంతో భారత్ 20 పరుగులు చేయగలిగింది. రోహిత్ 15 పరుగులు, రాహుల్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆసియా కప్ సూపర్ 4లో దాయాది పాక్‌తో మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. నసీమ్ షా వేసిన తొలి ఓవర్లో రోహిత్ సిక్స్ కొట్టాడు. తొలి ఓవర్లో భారత్ 11 పరుగులు చేసింది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
పాకిస్తాన్ జట్టు: మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహమ్మద్ నవాజ్, హారిస్ రవూఫ్, మహమ్మద్ హస్నయిన్, నసీమ్ షా
తాను టాస్ గెలిచి ఉన్నా బౌలింగే ఎంచుకునే వాడినని భారత సారథి రోహిత్ శర్మ చెప్పాడు. ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకొని జట్టులో కొన్ని మార్పులు చేశామని చెప్పాడు. హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవి బిష్ణోయి ఆడుతున్నారని వెల్లడించారు.
Three changes for #TeamIndia going into this game.
Deepak Hooda, Hardik Pandya and Ravi Bishnoi come in the Playing XI.
Live - https://t.co/xhki2AW6ro #INDvPAK #AsiaCup202 pic.twitter.com/ZeimY92kpW
— BCCI (@BCCI) September 4, 2022
టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే గాయంతో జట్టుకు దూరమైన దహానీ స్థానంలో హస్నయిన్ ఆడుతున్నట్లు చెప్పాడు. తాను టాస్ గెలిచి ఉన్నా బౌలింగే ఎంచుకునే వాడినని భారత సారధి రోహిత్ శర్మ చెప్పాడు.