IND VS PAK | పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అజేయంగా సెంచరీతో అజేయంగా నిలిచాడు. విరాట్‌కు ఇది వన్డేల్లో 51వ సెంచరీ కావడం విశేషం. 111 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. ఇక శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్ విధించిన లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఐసీసీ టోర్నీలో మరోసారి పాక్‌పై టీమిండియా ఎదురేలేదని నిరూపించింది. ఈ ఓటమితో పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా వైదొలిగినట్లే.
దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను బాబర్ ఆజం, ఇమామ్ ఉల్ హక్ తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఈ జోడిని హార్దిక్ పాండ్యా విడగొట్టాడు. పాండ్యా బౌలింగ్‌లో బాబర్ వికెట్ కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 23 పరుగులు చేసి బాబర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇమామ్ ఉల్ హక్ రన్ అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు. 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను సౌద్ షకీల్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. షకీల్ తన వన్డే కెరీర్లో నాల్గో అర్ధ సెంచరీ సాధించాడు. ఈ భాగస్వామ్యాన్ని అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు. రిజ్వాన్‌ను అక్షర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 77 బంతుల్లో మూడు ఫోర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్ వరుస వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే షకీల్ 76 బంతుల్లో ఐదు ఫోర్లతో 62 పరుగులు చేసిన హార్దిక్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. తైబ్ తాహిర్ (4), సల్మాన్ అలీ ఆఘా (19) పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత షాహిద్ ఆఫ్రిది డకౌట్ కాగా.. నషీమ్ షా 14, హరీస్ రవుఫ్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కుల్దీప్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యాకు మూడు, హర్షిత్ రాణా, అక్షర్, జడేజా తలో వికెట్ దక్కింది.
ఇక 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 42.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగా.. ఆది నుంచే రోహిత్ శర్మ పాక్ బౌలింగ్‌పై ఎదురుదాడి చేశాడు. వరుస ఫోర్లు, సికర్సలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో షాహిన్ ఆఫ్రిది వేసిన ఫుల్ లెన్త్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రోహిత్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 20 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 52 బంతుల్లో ఏడు ఫోర్ల సహాయంతో 46 పరుగులు చేసిన గిల్ అవుట్ అయ్యాడు. రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ అవుట్ అయ్యాక బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ విరాట్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలోనూ విరాట్, అయ్యర్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. ఇద్దరూ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. 67 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా (8), అక్షర్ పటేల్ (3నాటౌట్)తో కలిసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిదికి రెండు, అబ్రార్, ఖుష్దిల్ షాకు చెరో వికెట్ దక్కాయి.
వన్డేల్లో విరాట్ కోహ్లీ 51వ సెంచరీని నమోదు చేశాడు. 111 బంతుల్లో 100 పరుగులు చేసిన తర్వాత అతను నాటౌట్‌గా నిలిచాడు. అయితే, ఒక దశలో పాకిస్తాన్ విరాట్ సెంచరీ చేయకుండా ఉండటానికి కుట్ర చేసినట్లుగా అనిపించింది. షాహిన్ ఆఫ్రిది పదేపదే వైడ్లు వేయడంతో సెంచరీని అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లుగా అంతా భావించారు. 43వ ఓవర్లో భారత్ గెలిచేందుకు నాలుగు పరుగులు అవసరం కాగా.. కోహ్లీ సెంచరీ చేసేందుకు ఐదు పరుగులు అవసరం. 43వ ఓవర్ మొదటి బంతికి కోహ్లీ ఒక పరుగు తీశాడు. అక్షర్ ఆ తర్వాత బంతికి ఒక పరుగు తీయగా.. మూడో బంతిని విరాట్ ఫోర్‌గా మలిచి సెంచరీని పూర్తి చేసుకోగా.. టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ వన్డేల్లో 14వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్‌లో 14వేలు పూర్తి చేసి.. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసి.. ఈ మైలురాయిని అందుకున్నాడు. హారిస్ రవూఫ్ బోలింగ్లో ఫోర్ కొట్టిన విరాట్.. టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్, శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరను అధిగమించాడు.
చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు పాకిస్తాన్ ఆశలు అడియాశలయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి.. రేసులో ఉండాలని భావించిన పాకిస్తాన్‌కు నిరాశే ఎదురైంది. టీమిండియాపై పరాజయంతో టోర్నీపై ఆశలు గల్లంతయ్యాయి. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ దేశానికి తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఘోర పరాజయం పాలైంది. టోర్నీలో నిలువాలంటే.. టీమిండియాపై తప్పనిసరిగా సరిగా గెలువాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరువైంది. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉన్నది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం పాలైంది. పాకిస్తాన్ ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో తలపడనున్నది. టీమిండియా మూడో మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడుతుంది.