ఆసియా కప్‌లో టీమిండియా తన ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తడబడినప్పటికీ చివరకు విజయతీరాలకు చేరింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ను భారత బౌలర్లు 147 పరుగులకు ఆలౌట్ చేశారు. లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్ (0) డకౌట్ అవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (12) టెస్టు తరహా ఇన్నింగ్స్ ఆడాడు.
బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్‌పై కోహ్లీ (35) ఫర్వాలేదనిపించగా.. జడేజా (35) కూడా ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (18) ఆకట్టుకోలేకపోయాడు. ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా (33 నాటౌట్) నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన అతను.. జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.
చివర్లో జడేజా అవుటయినా.. దినేష్ కార్తీక్ (1 నాటౌట్) సింగిల్ తీయగా హార్దిక్ సిక్సర్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. దీంతో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్ మూడు వికెట్లు తీసుకోగా.. నసీమ్ షా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
WHAT. A. WIN!#TeamIndia clinch a thriller against Pakistan. Win by 5 wickets 👏👏
Scorecard – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/p4pLDi3y09
— BCCI (@BCCI) August 28, 2022