పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా యువ ప్లేయర్ రిషభ్ పంత్ ఆడతాడని తాను అనుకోవడం లేదని మాజీ దిగ్గజం వసీం జాఫర్ అన్నాడు. గాయంతో జడేజా జట్టుకు దూరమవడంతో అతని స్థానంలో అక్షర్ కన్నా దీపక్ హుడాను ఆడిస్తే బాగుంటుందని జాఫర్ అభిప్రాయపడ్డాడు. అలాగే దినేష్ కార్తీక్ ఉండగా పంత్‌ను ఆడిస్తారని తాను అనుకోవడం లేదన్నాడు.
కానీ అలా చేస్తే ఎడం చేతి వాటం బ్యాటర్లు జట్టులో ఉండరని, కాబట్టి కనీసం ఒక్క లెఫ్ట్ హ్యాండర్‌ని అయినా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. పాకిస్తాన్‌తో గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కూడా రిషభ్ పంత్‌ను జట్టు యాజమాన్యం పక్కనపెట్టేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తుచేసిన జాఫర్.. పంత్ లేకుండా ఎడం చేతి వాటం బ్యాటర్ కావాలంటే అక్షర్ ఒక్కడే ఉన్నాడని, కాబట్టి హుడాకు అవకాశం దక్కకపోవచ్చని, అక్షర్‌ను ఆడించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని వివరించాడు.