IND vs PAK | దాయాదుల సమరంలో టీమిండియా విజయ బావుటా ఎగురవేసింది. ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండగానే చేధించింది.
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ తడబడుతోంది. ఆరంభంలోనే కేఎల్ రాహుల్ (0) డకౌట్ కాగా.. ఆ తర్వాత కాసేపు నిలబడిన కోహ్లీ (35), రోహిత్ (12) స్వల్ప వ్యవధిలోనే వెనుతిరిగారు. ఇలాంటి సమయంలో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (18)ను నసీమ షా క్లీన్ బౌల్డ్ చేశాడు. నసీమ్ డెలివరీని సరిగా అంచనా వేయలేకపోయిన సూర్య.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు 89 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది.
పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి తడబడిన టీమిండియా సారధి రోహిత్ శర్మ (12) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. మహమ్మద్ నవాజ్ వేసిన 8వ ఓవర్ నాలుగో బంతికి భారీ సిక్సర్ బాతిన అతను.. చివరి బంతికి కూడా సిక్సర్ బాదడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో సరిగా కనెక్ట్ చెయ్యలేకపోవడంతో లాంగాఫ్‌లో ఉన్న ఇఫ్తికార్ అహ్మద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 8 ఓవర్లలో 50/2 స్కోరుతో నిలిచింది. ఆ తర్వాత కాసేపటికే అదే తరహా షాట్ ఆడబోయిన విరాట్ కోహ్లీ (35) కూడా అవుటయ్యాడు. కోహ్లీ కూడా నవాజ్ బౌలింగ్‌లో అహ్మద్‌కే క్యాచ్ ఇచ్చ
పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఊహించిన ఆరంభం లభించలేదు. 148 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (29 నాటౌట్).. కెప్టెన్ రోహిత్(4 నాటౌట్)కు జత కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.
వీళ్లిద్దరూ అనవసర షాట్లకు పోకుండా నిదానంగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో పవర్‌ప్లే ముగిసే సరికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 38 పరుగులతో నిలిచింది.
That's the end of the powerplay and #TeamIndia are 38/1
Live - https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/QMYOn7tznK
— BCCI (@BCCI) August 28, 2022
పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. తను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయిన అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. నసీమ్ షా వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన రాహుల్ దాన్ని సరిగా అంచనా వేయలేదు. దాంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. దీంతో ఒక్క పరుగు వద్దే భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించారు. కీలకమైన వికెట్లు తీసుకున్న వీళ్లకు అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ నుంచి మంచి సహకారం అందింది. దాంతో పాకిస్తాన్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మహమ్మద్ రిజ్వాన్ (43), ఇఫ్తికర్ అహ్మద్ (28) మాత్రమే రాణించారు. మిగతా ప్లేయర్లు బాబర్ ఆజమ్ (10), ఫఖర్ జమాన్ (10), ఖుష్దిల్ షా (2), షాదాబ్ ఖాన్ (10), ఆసిఫ్ అలీ (9), మహమ్మద్ నవాజ్ (1), నసీమ్ షా (0) ఎవరూ బ్యాటు ఝుళిపించలేకపోయారు. చివర్లో హారిస్ రవూఫ్ (13 నాటౌట్), షహ్నవాజ్ దహానీ (16) భారీ షాట్లు ఆడటంతో ఆ జట్టు 147 స్కోరైనా చెయ్యగలిగింది. అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో దహానీ క్లీన్ బౌల్డ్ అవడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 4, హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ 2 వికెట్లు తీసుకోగా.. ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్లో ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆసిఫ్ అలీ (9) కూడా అవుటయ్యాడు. భువీ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అలీ.. బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్‌కు చిక్కాడు. అంతకుముందు పాండ్యా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో రిజ్వాన్ (43), ఖుష్దిల్ (2) అవుటవడంతో అలీపైనే పాక్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్లో ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆసిఫ్ అలీ (9) కూడా అవుటయ్యాడు. భువీ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన అలీ.. బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్‌కు చిక్కాడు. దీంతో ఆ జట్టు 112 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు పాండ్యా బౌలింగ్‌లో ఒకే ఓవర్లో రిజ్వాన్ (43), ఖుష్దిల్ (2) అవుటవడంతో అలీపైనే పాక్ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
భారత్, పాక్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడమే కాకుండా కీలక వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఇఫ్తికార్ (28)ను అవుట్ చేసిన పాండ్యా.. నిలకడగా ఆడుతున్న మహమ్మద్ రిజ్వాన్ (43)ను కూడా పెవిలియన్ చేర్చాడు. పాండ్యా వేసిన షార్ట్ బంతిని డీప్ థర్డ్ దిశగా ఆడేందుకు రిజ్వాన్ ప్రయత్నించాడు. అయితే అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ఆవేష్ ఖాన్ వేగంగా వచ్చి క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే ఖుష్దిల్ షా (2)ను కూడా పాండ్యా వెనక్కు పంపాడు. పాండ్యా వేసిన బంతిని బలంగా బాదేందుకు అతను ప్రయత్నించాడు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని జడేజా పట్టేశాడు. దాంతో ఖుష్దిల్ కూడా పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ జట్టు 97 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పాకిస్తాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారీ షాట్లు ఆడుతున్న ఇఫ్తికార్ అహ్మద్ (28)ను హార్దిక్ అవుట్ చేశాడు. హార్దిక్ వేసిన షార్ట్ బాల్‌ను ఆడటంలో అహ్మద్ విఫలమయ్యాడు. దాంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ కార్తీక్ జంప్ చేసి అందుకోవడంతో అహ్మద్ పెవిలియన్ చేరాడు. దీంతో 87 పరుగుల వద్ద పాక్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది.
భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. బాబర్ ఆజమ్ (10), ఫఖర్ జమాన్ (10) ఇద్దరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ.. మరో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (29 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (16 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో పది ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 68 స్కోరుతో నిలిచింది.
బాబర్ ఆజమ్ (10) అవుటైన కాసేపటికే మరో కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ (10) కూడా పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్లో షార్ట్ బంతిని అంచనా వేయలేకపోయిన జమాన్.. భారత ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేయకముందే పెవిలియన్ బాటపట్టాడు.
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ తీసుకుంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లోనే సత్తాచాటాడు. తొలి ఓవర్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను ఇబ్బంది పెట్టిన భువీ.. మూడో ఓవర్ నాలుగో బంతికి అతన్ని అవుట్ చేశాడు. భువీ వేసిన షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించాడు.
ఆసియా కప్ వేదికగా దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. గతేడాది ఇదే దుబాయ్‌లో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. క్రీడాభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారధి రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.