IND vs NZ Live Updates | భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే లైవ్ అప్డేట్స్
IND vs NZ | ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే పోరుకు సమాయత్తమైంది. ఒక వైపు టికెట్ల లొల్లి.. మరోవైపు హెచ్‌సీఏలో లుకలుకల మధ్య దాదాపు నాలుగేండ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగుతుంది.
IND vs NZ | ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే పోరుకు సమాయత్తమైంది. ఒక వైపు టికెట్ల లొల్లి.. మరోవైపు హెచ్‌సీఏలో లుకలుకల మధ్య దాదాపు నాలుగేండ్ల తర్వాత ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇటీవల శ్రీలంకపై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి రోహిత్ సేన జోరు మీదుంటే.. మరోవైపు పాకిస్థాన్‌పై వన్డే సిరీస్ నెగ్గి న్యూజిలాండ్ సమరోత్సాహంతో కదనానికి సిద్ధమైంది. ఇప్పటికే నగరానికి క్రికెట్ ఫీవర్ పట్టుకోగా.. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమంగా సహకరించనున్న పిచ్‌పై ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!
-
18 Jan 2023 09:42 PM (IST)
ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం.. 337 పరుగులకు కివీస్ ఆలౌట్

ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో చివరి వరకు పోరాడిన కివీస్.. 337 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 12 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది.
-
18 Jan 2023 09:27 PM (IST)
8వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్, 46 ఓవర్లకు కివీస్ స్కోర్ 294/8
టీమిండియా సెట్ చేసిన టార్గెట్‌ను చేరేందుకు కష్టపడుతున్న కివీస్ మరో వికెట్‌ను కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో హెన్నీ షిప్లే ( 0) ఔటయ్యాడు. 46 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 294/8. క్రీజులో బ్రేస్‌వెల్ (108), ఫెర్గూసన్ (0) ఉన్నారు.
-
18 Jan 2023 09:08 PM (IST)
బ్రేస్‌వెల్ సెంచరీ..
కివీస్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్‌వెల్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. 57 బంతుల్లోనే 11 ఫోర్లు 5 సిక్సర్లతో శతకం చేశాడు. షమీ బౌలింగ్‌లో సిక్స్ బాది వంద పరుగుల మార్క్ అందుకున్నాడు. వన్డేల్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ తరఫున వేగవంతమైన సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. అతను శాంట్నర్‌తో కలిసి ఏడో వికెట్‌కు 136 పరుగులు జోడించాడు.
-
18 Jan 2023 08:44 PM (IST)
బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీ.. కివీస్ స్కోర్ ఎంతంటే..?
టెయిలెండర్‌గా వచ్చిన మైఖేల్ బ్రేస్‌వెల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 32 బంతుల్లోనే 9 ఫోర్లు ఒక సిక్సర్‌తో అర్థ శతకం చేశాడు. దాంతో కివీస్ రెండొందలు దాటింది. శాంట్నర్, బ్రేస్‌వెల్ జోడీ ఏడో వికెట్‌కు 72 పరుగులు చేసింది. వీళ్లిద్దరూ భారత బౌలర్లను ఎదుర్కొంటూ బౌండరీలు బాదుతున్నారు. టామ్ లాథమ్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 36 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి205 రన్స్ చేసింది. బ్రేస్‌వెల్ 57, శాంట్నర్ 27 రన్స్‌తో ఆడుతున్నారు. ఆ జట్టు విజయానికి 78 బంతుల్లో 145 పరుగులు కావాలి.
-
18 Jan 2023 07:52 PM (IST)
గ్గెన్ ఫిలిప్స్ బౌల్డ్.. సగం వికెట్లు కోల్పోయిన కివీస్
భారత స్టార్ పేసర్ షమీ మరోసారి చెలరేగాడు. గ్రెన్ ఫిలిఫ్స్‌ను బౌల్డ్ చేశాడు. దాంతో. కివీస్ సగం వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టామ్ లాథమ్, బ్రాస్‌వెల్ క్రీజులో ఉన్నారు. 24 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది.
-
18 Jan 2023 07:43 PM (IST)
24 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 110/4
న్యూజిలాండ్ 24 ఓవర్లకు 110 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (16), గ్లెన్ ఫిలిప్స్ (11) క్రీజులో ఉన్నారు.
-
18 Jan 2023 07:34 PM (IST)
22 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 104/4
న్యూజిలాండ్ 22 ఓవర్లకు 104 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (14), గ్లెన్ ఫిలిప్స్ (7) క్రీజులో ఉన్నారు.
-
18 Jan 2023 07:21 PM (IST)
నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. మిచ్చెల్ ఎల్బీడబ్ల్యూ
కివీస్ మరో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి మిచ్చెల్ (9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. క్రీజులో టామ్ లాథమ్ (6), గ్లెన్ ఫిలిప్ (6) ఉన్నారు. 18 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 95/4
-
18 Jan 2023 07:10 PM (IST)
మూడో వికెట్ కోల్పోయిన కివీస్

చైనామన్ బౌలర్ కుల్దీప్ భారత్‌కు మూడో వికెట్ అందించాడు. నికోలస్‌ను బౌల్డ్ చేశాడు. డ్రింక్స్ అనంతరం కుల్దీప్ వేసిన ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టిన నికోలస్ మూడో బంతికి వెనుదిరిగాడు. కీలకమైన మూడు వికెట్లు పడిపోవడంతో కివీస్ కష్టాల్లో పడింది. ఆ జట్టు విజయానికి 34 ఓవర్లలో 271 రన్స్ కావాలి. 15 ఓవర్లకు కివీస్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.
-
18 Jan 2023 06:59 PM (IST)
రెండో వికెట్ కోల్పోయిన కివీస్.. 14 ఓవర్లకు కివీస్ స్కోర్ 70/2
కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. 14వ ఓవర్లో ఫిన్ అలెన్ (40) ఔటయ్యాడు. ప్రస్తుతం హెన్నీ నికోలస్ (14), మిచ్చెల్ (0) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లకు కివీస్ స్కోర్ 70/2
-
18 Jan 2023 06:52 PM (IST)
పవర్ ప్లేలో న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..?
భారత బౌలర్లు సిరాజ్, షమీ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తుడడంతో కివీస్ బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. దాంతో, పవర్ ప్లేలో న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 41 రన్స్ మాత్రమే చేసింది. అలెన్ 17, నికోలస్ 10 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. లోకల్ బాయ్ సిరాజ్ భారత్‌కు తొలి వికెట్ అందిందాడు. అతని బౌలింగ్‌లో డ్వేన్ కాన్వే (10) అవుట్ అయ్యాడు.
-
18 Jan 2023 06:21 PM (IST)
తొలి వికెట్ కోల్పోయిన కివీస్.. 6 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 28/1
350 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కివీస్ ఆరో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. కొన్వే (10 ) ఔటయ్యాడు. ఆరు ఓవర్లకు వికెట్ నష్టానికి కివీస్ 28 పరుగులు చేసింది. క్రీజులో ఫిన్ ఎల్లెన్ (14), హెన్రీ నికోల్లస్ (0) ఉన్నారు.
-
18 Jan 2023 06:11 PM (IST)
బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్.. 4 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్
టీమిండియా నిర్దేశించిన 350 పరుగుల విజయలక్ష్యంతో కివీస్ బరిలోకి దిగింది. 4 ఓవర్లకు వికెట్ నష్టం లేకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో ఫిన్ ఎల్లెన్ (10), డెవొన్ కొన్వే (10) ఉన్నారు.
-
18 Jan 2023 05:21 PM (IST)
న్యూజిలాండ్ విజయలక్ష్యం 350 పరుగులు
ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శుభ్‌మన్ చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీతో దూకుడు ప్రదర్శించడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో శుభ్‌మన్ చెలరేగి ఆడాడు. డబుల్ సెంచరీతో దూకుడు ప్రదర్శించడంతో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
-
18 Jan 2023 05:16 PM (IST)
49 ఓవర్లకు టీమిండియా స్కోర్ 339/7
49 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 339 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (202), కుల్దీప్ యాదవ్ (3) ఉన్నారు.
-
18 Jan 2023 05:12 PM (IST)
శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్లో తొలి డబుల్ సెంచరీ బాదాడు. 145 బంతుల్లోనే అతను రెండొందలు సాధించాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. తన కళాత్మక షాట్లతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. దాంతో భారత్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. అంతకుముందు గిల్ సిక్సర్‌తో 150కి చేరువయ్యాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు.
-
18 Jan 2023 05:08 PM (IST)
47 ఓవర్లకు టీమిండియా స్కోర్ 310/7
47 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి టీమిండియా 310 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (181), కుల్దీప్ యాదవ్ (2) క్రీజులో ఉన్నారు.
-
18 Jan 2023 05:08 PM (IST)
శార్ధూల్ రనౌట్..

భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. శార్ధూల్ ఠాకూర్ రనౌట్ అయ్యాడు. ఫెర్గూసన్ వేసిన 47 ఓవర్లో అతను అవుట్ అయ్యాడు. అంతకు ముందు షిప్లే బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ ఎల్బీగా వెనుదిరిగాడు.
-
18 Jan 2023 04:55 PM (IST)
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా.. వాషింగ్టన్ సుందర్ ఔట్
45 ఓవర్లకు టీమిండియా స్కోర్ 292/6. క్రీజులో శుభ్‌మన్ గిల్ (162), శార్దూల్ ఠాకూర్ (0) ఉన్నారు.
-
18 Jan 2023 04:49 PM (IST)
44 ఓవర్లకు టీమిండియా స్కోర్ 286/5
43 ఓవర్లకు టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (159), వాషింగ్టన్ సుందర్ (10) ఉన్నారు.
-
18 Jan 2023 04:44 PM (IST)
43 ఓవర్లకు టీమిండియా స్కోర్ 279/5
43 ఓవర్లకు టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (154), వాషింగ్టన్ సుందర్ (8) ఉన్నారు. ఈ ఒక్క ఓవర్లోనే 10 పరుగులు వచ్చాయి.
-
18 Jan 2023 04:42 PM (IST)
42 ఓవర్లకు టీమిండియా స్కోర్ 269/5
42 ఓవర్లకు టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (147), వాషింగ్టన్ సుందర్ (5) ఉన్నారు.
-
18 Jan 2023 04:36 PM (IST)
41 ఓవర్లకు టీమిండియా స్కోర్ 257/5
41 ఓవర్లకు టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (138), వాషింగ్టన్ సుందర్ (3) ఉన్నారు.
-
18 Jan 2023 04:34 PM (IST)
పాండ్యా అవుట్.. 40 ఓవర్లకు భారత్ స్కోర్ 251/5
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. మిచెల్ వేసిన 40 ఓవర్ మూడో బంతకి బౌల్డ్ అయ్యాడు. దాంతో, భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. గిల్, పాండ్యా 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. 40 ఓవర్లు భారత్ 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
-
18 Jan 2023 04:22 PM (IST)
39 ఓవర్లకు టీమిండియా స్కోర్ 246/4
39 ఓవర్లకు టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (131), హార్దిక్ పాండ్యా (27) ఉన్నారు.
-
18 Jan 2023 04:15 PM (IST)
వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న గిల్

అద్భుత ఫామ్ కొనసాగిస్తున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో తొలి మైలురాయి అందుకున్నాడు. వన్డేల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ మార్క్ అందుకోవడం విశేషం.
-
18 Jan 2023 04:13 PM (IST)
37 ఓవర్లకు టీమిండియా స్కోర్ 232/4
37 ఓవర్లకు టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (122), హార్దిక్ పాండ్యా (22) ఉన్నారు.
-
18 Jan 2023 04:01 PM (IST)
34 ఓవర్లకు టీమిండియా స్కోర్ 210/4
34 ఓవర్లకు టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (111), హార్దిక్ పాండ్యా (12) ఉన్నారు.
-
18 Jan 2023 03:44 PM (IST)
వన్డేల్లో మూడో శతకం బాదిన శుభ్‌మన్ గిల్

యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరో శతకం బాదాడు. 87 బంతుల్లోనే వంద పరుగులు సాధించాడు. దాంతో వన్డేల్లో మూడో, స్వదేశంలో రెండో సెంచరీ నమోదు చేశాడు. శాంట్నర్ బౌలింగ్ సిక్స్, సింగిల్ తీసి సెంచరీ మార్క్ అందుకున్నాడు.
శ్రీలంకతో మూడో వన్డేలో సెంచరీతో కదం తొక్కిన గిల్ న్యూజిలాండ్ మీద కూడా క్లాస్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సూర్యకుమార్‌తో కలిసి ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నాలుగో వికెట్‌కు వీళ్లిద్దరూ 51బంతుల్లోనే65 రన్స్ చేశారు. ప్రస్తుతం గిల్, హార్ధిక్ పాండ్యా ఆడున్నారు.
-
18 Jan 2023 03:38 PM (IST)
సూర్య కుమార్ అవుట్.. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
డారిల్ మిచెల్ న్యూజిలాండ్‌కు నాలుగో వికెట్ అందించాడు. దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (31)ను అవుట్ చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్య క్యాచ్ అవుట్ అయ్యాడు. 26 బంతుల్లోనే 31 రన్స్ కొట్టిన సూర్య వేగంగా ఆడే క్రమంలో వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో గిల్, సూర్య 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ (92) సెంచరీకి చేరువలో ఉన్నాడు. హార్ధిక్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. 28 ఓవర్లు భారత్ స్కోర్ 177/4.
-
18 Jan 2023 03:10 PM (IST)
శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ.. మూడో వికెట్‌గా వెనుదిరిగిన ఇషాన్
ఇషాన్ కిషన్ (5) మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ల్యూక్ ఫెర్గూసన్ బౌలింగ్ ఫోర్ కొట్టి ఊపు మీదున్న అతను మరుసటి బంతికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో, 110 పరుగల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. అంతకు ముందు ఓవర్లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల హాఫ్ సెంచరీ కొట్టాడు. బ్రాస్‌వెల్ ఓవర్లో సిక్సర్ బాది అర్థశతకం సాధించాడు. 52 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు.
-
18 Jan 2023 02:40 PM (IST)
శాంట్నర్ బౌలింగ్‌లో కోహ్లీ బౌల్డ్
సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(8)పెవిలియన్ చేరాడు. శాంట్నర్ వేసిన 15వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు 10 బంతుల్లో 8 పరుగులు చేశాడు. వెంట వెంటనే రెండు కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. శ్రీలంక సిరీస్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (42), ఇషాన్ కిషన్ (2) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లుకు భారత్ స్కోర్ 91/2.
-
18 Jan 2023 02:30 PM (IST)
రోహిత్ శర్మ అవుట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్..
భారత ఓపెనర్ రోహిత్ శర్మ (34) అవుట్ అయ్యాడు. దాంతో 60 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడిన రోహిత్ 34 పరుగులకు వెనుదిరిగాడు. టిక్నర్ వేసిన 13 ఓవర్లో మిచెల్ క్యాచ్ పట్టడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. శుభ్‌మన్ గిల్ (41), విరాట్ కోహ్లీ (8) నిలకడగా ఆడుతున్నారు. మొదటి వికెట్‌కు రోహిత్‌తో కలిసి గిల్ 60 రన్స్ జోడించాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 88.
-
18 Jan 2023 01:10 PM (IST)
కివీస్‌తో తొలి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉందని, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు రోహిత్ తెలిపాడు. లైట్ల వెలుతురులో స్కోర్‌ను డిఫెండ్ చేయాలనుకుంటున్నట్లు రోహిత్ చెప్పాడు. ఇండియన్ జట్టులోకి కేఎల్ రాహుల్, అయ్యర్, అక్షర్ స్థానాల్లో హార్ధిక్, ఠాకూర్, కిషన్‌లను తీసుకున్నారు. కివీస్ జట్టుకు లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

